హానర్ 200 ప్రో: బెస్ట్ ప్రాసెసర్‌తో తీసుకొచ్చిన మరో ఫోన్ హానర్ 200. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ధర రూ. 57,999గా నిర్ణయించారు. ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లేను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను, 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.
మోటో రేజర్ 50 అల్ట్రా: పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో తీసుకొచ్చిన మరో ఫోన్ మోటో రేజర్ 50 అల్ట్రా. ఈ ఫోన్ ధర రూ. 55,000గా నిర్ణయించారు.ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1.5కే రిలజ్యూష్ ఈ స్క్రీన్ సొంత. కెమెరా విషయానికొస్తే ఇందులో 60 ఎంపీ రెయిర్ కెమెరాను, 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
పోకో ఎఫ్6: పోకో ఎఫ్6లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్, జెన్3 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1.5కే రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే ప్రారంభ వేరియంట్ ధర రూ. 29,999గా నిర్ణయించారు. 50 ఎంపీ కెమెరా ఈ ఫోన్ సొంతం.
రియల్‌మీ జీటీ6: పవర్‌ఫుల్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్, జెన్3తో వచ్చిన మరో స్మార్ట్ ఫోన్స్‌లో రియల్‌మీ జీటీ6 ఒకటి. ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన 1.5కే రిజల్యూషన్ ఎల్‌టీపీఓ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ను ఇచ్చారు. 6000 నిట్స్ బ్రైట్‌నెట్ ఈ స్క్రీన్ సొంతం. ఇందులో 50 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 40,999గా ఉంది.
షావోమీ 14 సివీ: షావోమీ 14 సివీ ఫోన్‌లో కూడా ఇదే పవర్ ఫుల్ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్‌ధర రూ. 42,999గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.55 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెచ్‌జెడ్ అమోఎల్‌ఈడీ స్క్రీన్ సొంతం. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఒకటి.