ఈ అనంత విశ్వం ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు. 🌌🪐 మానవ మేథస్సు ఎంతలా అభివృద్ధి చెందుతున్నా, ఖగోళాంతరంలో ఉన్న ఎన్నో రహస్యాలను చేధిస్తున్నా. 🌠
ఇలాంటి ఖగోళ రహస్యాల్లో 16 సైక్ అనే గ్రహ శకలం ఒకటి. 🌏 అంగారక గ్రహం, బృహస్పతి మధ్య ఉన్న 16 సైక్ అనే భారీ లోహ గ్రహశకలాన్ని ఛేదించే పనిలో పడింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నాసా. 🚀 ఈ గ్రహశకలంపై ఉన్న రహస్యాలను చేధించేందుకు గాను నాసా ఓ మిషన్‌ను చేపట్టింది. 🛰️ ఈ క్రమంలో గ్రహశకలానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 🌓 ఈ లోహ గ్రహశకలంలో 10,000 క్వాడ్రియన్ డాలర్లకు సమానమైన ఇనుము, నికెల్, బంగారం ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 💰 ఒక క్వాడ్రియన్ రూ. 7,44,045తో సమానం. 🤑 ఈ లెక్కన 10,000 క్వాడ్రియన్ డాలర్లు అంటే ఎన్ని లక్షల కోట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 💲 ఒకవేళ ఈ గ్రహశకలం భూమిపైకి వస్తే పంట పండినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 🌑🪙 ఈ గ్రహశకలంపై లభించే విలువైన ఇనుము, బంగారంతో భూమిపై ఉన్న ప్రతీ ఒక్కరూ లక్షాధికారి కావొచ్చు. 🌍