🍅 టమాటా మోత మోగిస్తూనే ఉంది. సామన్యుడి నుంచి ప్రథమ పౌరుడి వరకు చుక్కలు చూపిస్తోంది. మన ఇంట్లోని వంటగది నుంచే కాదు.. గవర్నర్ కిచెన్ మెనూ నుంచి కూడా మాయం అయ్యింది. అవును..! ఇది నిజం… రోజు రోజుకు పెరుగుతున్న టమాట ధరతో విసిగిపోయన ఆ రాష్ట్ర గవర్నర్ తమ ఫుడ్ మెనును మార్చుకున్నారు. అంత పెట్టి కొనేది లేదని తేల్చేశారు.
టమోటాలు నుండి తొలగించబడ్డాయి. పంజాబ్‌లో టమాటా కిలో ధర రూ.200కి చేరింది. ఇది మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టమాటల స్థానంలో ఇతర ఆహారపదార్థాలను తాత్కాలికంగా భర్తీ చేయాలని అక్కడి గవర్నర్ ప్రజలను కోరారు. అలా చేయడం వల్ల వాటి పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. 🛡️🚫
🍅 రాజ్‌భవన్ ఇచ్చిన ఓ ప్రకటన ప్రకారం.. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం అధిపతిగా కూడా పనిచేస్తున్నారు. పెరుగుతున్న ఆహార ధరల ప్రభావాలను అనుభవిస్తున్న పంజాబ్ నివాసితులకు మద్దతుగా టమాట వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధించాలని నిర్ణయించుకున్నారు. 🔴🛢️