top of page
Shiva YT

🍅🛒 మరింతగా దిగొచ్చిన టమాట ధరలు.. హైదరాబాద్‌లో కిలో ఎంతంటే?

🏙️📅 హైదరాబాద్‌, ఆగస్ట్‌ 8: టమాట.. నిన్న మొన్నటిదాకా ఈ పేరు వింటే సామాన్యులు బెంబేలెత్తిపోయేవారు. ఎందుకంటే ధరలు ఆ రేంజ్​లో ఉండేవి.

భారీగా పెరిగిన ధరలతో కొత్త మంది టమాటాలు వాడడమే మానేశారు చాలా చోట్ల. తెలుగు రాష్ట్రాల్లోనే పలు చోట్లు ఏకంగా డబుల్ సెంచరీ క్రాస్ చేశాయంటే సాధారణ విషయం కాదు… రైతు మార్కెట్లలోనే నిన్నటి వరకు కేజీ 150 రూపాయల ధర ఉంటే ఇక రిటైల్ మార్కెట్‌లో క్వాలిటీ బట్టి 200 రూపాయల కంటే పైనే అమ్మేసుకున్నారు వ్యాపారులు. కొన్ని రోజులైతే చాలా చోట్లో టమాటాలు అసలు కనుమరుగైపోయాయి. కానీ రెండు మూడు రోజుల నుంచి టమాటా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. డబుల్ సెంచరీ దిశగా పరిగెడుతున్న టమోటా ధరలకు బ్రేక్ పడింది.. గత రెండు నెలల నుంచి చుక్కలు చూపిస్తున్న టమాటా.. మిడిల్ క్లాస్ జనానికి అందుబాటులోకి వచ్చింది. వర్షాలు తగ్గడంతో మార్కెట్‌కు టమాటా దిగుమతులు పెరిగి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబార్‌కు టమాటా రాక పెరగడంతో ధరలు తగ్గాయి. 1st క్వాలిటీ టమాట రూ.100, 2nd క్వాలిటీ అయితే రూ. 80, 60. అమాంతం పడిపోయిన టమాట ధరలతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. నెలాఖరు వరకు ధరలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

Related Posts

See All

🗣️ లోక్‌సభలో రాహుల్ ప్రసంగం వెనుక స్క్రిప్ట్‌ ప్లే చేసింది ఎవరో తెలుసా..

🗣️లోక్‌సభలో బుధవారం (ఆగస్టు 9) మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

bottom of page