మొన్నమొన్నటి వరకూ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్న టమాట ధరలు తగ్గుతున్నాయి. 📈😟
గడచిన రెండు రెండు రోజులుగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 📉😔
మొన్నటి వరకూ కిలో టమాట రూ.300 వరకు చేరే అవకాశం ఉందని బెంబేలెత్తిపోతున్న తరుణంలో అనూహ్యంగా ధరలు దిగివచ్చాయి. 😞
ప్రస్తుతం రైతుబజారులో కిలో టమాట రూ.63 వరకు విక్రయిస్తు్న్నారు. 🛒💲
ఇక బయట మార్కెట్‌లలో రూ.120 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నారు. 🏪💹
గత పది రోజుల కిందట హైదరాబాద్ నగరానికి కేవలం 850 క్వింటాళ్ల టమాట హోల్‌సేల్ మార్కెట్‌కు చేరితే.. సోమవారం 2,450 క్వింటాళ్లు వచ్చింది. 🏢📊
ఏపీలోని అనంతపురం, చిత్తూరు, కర్ణాటక రాష్ట్రం నుంచి నగరానికి అధిక దిగుబడి వస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని రంగారెడ్డి, వికారాబాద్, చేవెళ్ల, నవాబ్‌పేట, మెదక్ జిల్లాల నుంచి కూడా పెద్ద మొత్తంలో మార్కెట్‌కు టమాటా రావడంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. 🛣️🌐🛒