🇮🇳 దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాట ధరలు కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.300కి చేరాయి. దీని ప్రభావం ప్రజల జేబుపై పడుతోంది. కొంతమంది కిచెన్‌లో టమాటో ఉపయోగించడం మానేశారు. అయితే చాలామంది ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. మాటల్లో వినిపిస్తోందే తప్ప మార్కెట్‌లో కనిపించడం లేదు టమోటా. 🤨🛒
📉 దేశవ్యాప్తంగా రెండు నెలలుగా టమాటా దిగుబడి తగ్గి, కొరత పెరిగింది. ఈ నెల ప్రారంభంలో కిలో టమాట రూ.200 నుంచి రూ.230 వరకు విక్రయించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు కిలో రూ.130కి విక్రయించారు. టమాటా ధర మళ్లీ పెరిగి కిలో రూ.200కు విక్రయిస్తుండడంతో జనం షాక్ తిన్నారు. 🥺😫
💰 వివిధ జిల్లాల్లో హోల్‌సేల్‌పై రూ. 150 నుంచి రూ. 180.. చిల్లరగా టమాట రూ.200 వరకు విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారుల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. 🤔💸 హోల్‌సేల్ మార్కెట్‌లో టమాటా ధర రూ.180కి చేరుకోగా.. బైంసా నగరంలో పలుచోట్ల రిటైల్ వ్యాపారంలో టమాటా ధర రూ.200కు చేరింది. 💰💵