top of page

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రి కాబోతున్నడా..? 🌟👰

ఇటీవల టాలీవుడ్ లో శుభవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు పెళ్లి పీటలు ఎక్కినా విషయం తెలిసిందే.

ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ, హీరోయిన్ లావణ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దాంతో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ కుష్ అవుతున్నారు. ఈ పెళ్ళిలో మెగా హీరోలందరూ ఓకే ఫ్రెమ్ లో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే యంగ్ హీరో శర్వానంద్ కూడా ఇదే ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. శర్వానంద్ ఇప్పుడు తండ్రి కాబోతున్నాడని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. శర్వానంద్ భార్య అమెరికాలో బిడ్డకు జన్మనివ్వనుందని కూడా వార్తలు వచ్చాయి. 🤵👰

నిఖిల్ 2020లో ప‌ల్ల‌వి వ‌ర్మను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో నిఖిల్ తండ్రి కాబోతున్నడన్న ప్రచారం జోరందుకుంది. దీని పై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి. 🎉👶

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page