top of page
Suresh D

డిఫరెంట్ లుక్‍లో విశ్వక్‍సేన్.. గామి ఫస్ట్ లుక్ రిలీజ్

గామి అనే ప్రయోగాత్మక చిత్రం కూడా విశ్వక్‍సేన్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఇప్పుడు గామి సినిమా నుంచి ఫస్ట్ వచ్చేసింది. దీంట్లో విశ్వక్‍ లుక్ చాలా డిఫరెంట్‍గా ఉంది.

మాస్ కా దాస్, యంగ్ హీరో విశ్వక్‍సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చేస్తున్నారు. గోదావరి జిల్లాల బ్యాక్‍డ్రాప్‍లో మాస్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండనుంది. మార్చి 8వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. మరోవైపు, గామి అనే ప్రయోగాత్మక చిత్రం కూడా విశ్వక్‍సేన్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఇప్పుడు గామి సినిమా నుంచి ఫస్ట్ వచ్చేసింది. దీంట్లో విశ్వక్‍ లుక్ చాలా డిఫరెంట్‍గా ఉంది.

గామి చిత్రంలో అఘోరగా విశ్వక్‍సేన్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విశ్వక్‍సేన్ ఫస్ట్ లుక్ నేడు (జనవరి 28) రిలీజ్ అయింది. హైదరాబాద్ కామిక్ కాన్ ఈవెంట్‍లో ఈ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. అఘోరగా విశ్వక్‍సేన్ లుక్ చాలా డిఫరెంట్‍గా ఉంది. సీరియస్ లుక్‍తో ఉన్న ఈ పోస్టర్ మూవీపై ఆసక్తిని పెంచేసింది. అఘోరగా ఉన్న విశ్వక్‍ను ముట్టుకునేందుకు కొన్ని చేతులు వస్తున్నట్టుగా పోస్టర్‌లో ఉంది. గామి పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది. “మానవుల స్పర్శే అతడికి అతిపెద్ద భయం. అలాగే, అతడి అమితమైన కోరిక కూడా మానవ స్పర్శే” అంటూ క్యాప్షన్ ఉంది. స్పర్శ చుట్టూ ఈ మూవీ కథ ఉండేలా కనిపిస్తోంది. గామి చిత్రానికి విద్యాధర్ కగిట దర్శకత్వం వహిస్తున్నారు.

గామి సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా షురూ అయ్యాయని సమాచారం. అయితే, ఇప్పటి వరకు పెద్దగా సమాచారాన్ని వెల్లడించలేదు. ఇప్పుడు, ఫస్ట్ లుక్‍ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. త్వరలోనే ఈ సినిమా విడుదలవుతుందని మూవీ టీమ్ పేర్కొంది.

“ఓ వ్యక్తి విభిన్నమైన కథ.. అతిపెద్ద భయాన్ని అధిగమించేందుకు అతడి ప్రయాణం” అంటూ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వీ సెల్యులాయిడ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలో రిలీజ్ అవుతుందని పేర్కొంది. కార్తీక్ శబరీశ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వీ సెల్యులాయిడ్ పతాకం సమర్పిస్తోంది.

గామి చిత్రంలో హీరోయిన్ చాందినీ చౌదరి, ఎంజీ అభినయ, మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పెడన కీలకపాత్రలు పోషించారు. గామి చిత్రం కోసం నాలుగేళ్లగా పని చేస్తున్నామని ఇటీవల విశ్వక్ చెప్పారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై విశ్వక్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

bottom of page