top of page

విశ్వంభ‌ర సెట్స్‌లో అడుగుపెట్టిన చిరు - ఏడాది ముందే మెగాస్టార్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్‌!🎥✨

చిరంజీవి విశ్వంభ‌ర మూవీ రిలీజ్ డేట్‌ను శుక్ర‌వారం అనౌన్స్‌చేశారు. సంక్రాంతి కానుక‌గా 2025 జ‌న‌వ‌రి 10న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. మంగ‌ళ‌వారం విశ్వంభ‌ర మూవీ సెట్స్‌లో చిరంజీవి అడుగుపెట్టాడు.🎥✨

మెగా అభిమానుల‌కు విశ్వంభ‌ర మేక‌ర్స్ గుడ్‌న్యూస్ వినిపించారు. చిరంజీవి ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టిన‌ట్లు అనౌన్స్‌చేశారు. అంతే కాకుండా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేశారు.  

విశ్వంభ‌ర సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ సినిమాసెట్స్‌లో చిరంజీవి అడుగుపెట్టారు. ఈ విష‌యాన్ని సినిమా యూనిట్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేస్తూ ఓ స్పెష‌ల్ వీడియోను అభిమానుల‌తో పంచుకున్నారు. కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

మెరుపుల‌తో కూడిన కొత్త లోకంలోకి చిరంజీవి ఎంట‌ర్ అవుతోన్న‌ట్లుగా డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది. మంగ‌ళ‌వారం నుంచి చిరంజీవి షూటింగ్‌ను మొద‌లుపెట్టారు. హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో చిరంజీవితో ప్ర‌ధాన తారాగ‌ణంపై ద‌ర్శ‌కుడు వ‌శిష్ట మ‌ల్లిడి కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. న‌వంబ‌ర్‌లోనే ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. చిరంజీవి లేకుండా మిగిలిన ఆర్టిస్టుల‌పై కొంత టాకీ పార్ట్‌ను పూర్తిచేశారు. 

విశ్వంభ‌ర కోసం భారీ బ‌డ్జెట్‌తో 13 సెట్స్‌ను సినిమా యూనిట్ తీర్చిదిద్దింది. ఈ సెట్స్‌లోనే విశ్వంభ‌ర సినిమాను చాలా వ‌ర‌కు తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఫాంట‌సీ అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా వ‌శిష్ట మ‌ల్లిడి ఈ మూవీని తెర‌కెక్కిస్తోన్నారు. దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్‌తో గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్ హంగుల‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. 

విశ్వంభ‌ర మూవీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. 2025 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఏడాది ముందే రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేసి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు. సంక్రాంతి బ‌రిలో చిరంజీవి ఖాయ‌మైంది. చిరంజీవితో నాగార్జున‌, దిల్‌రాజు సినిమాలు కూడా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విశ్వంభ‌ర‌తో పోటీప‌డ‌నున్నాయి.

విశ్వంభ‌ర సినిమాలో హీరోయిన్లు ఎవ‌ర‌న్న‌ది మేక‌ర్స్ ఇప్ప‌టివ‌ర‌కు రివీల్ చేయ‌లేదు. త్రిష‌, మృణాల్ ఠాకూర్‌తో ప‌లువురు స్టార్ హీరోయిన్లు ఈ సినిమాలో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. విశ్వంభ‌ర సినిమాకు కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. యూవీ క్రియేష‌న్స్ ప‌తాకంపై విక్ర‌మ్‌, వంశీ ప్ర‌మోద్ నిర్మిస్తున్నారు. విశ్వంభ‌ర మూవీకి చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప‌నిచేస్తోంది.🎥✨

bottom of page