top of page

🎬 బెదురులంక 2012 మూవీ రివ్యూ 🎥

కథ:

గోదావరి జిల్లాల్లో బెదురులంక అనే ఊరు ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న ఊరికి యుగాంతం టెన్షన్ పడుతుంది.. నిజంగానే యుగాంతం వస్తుందా.. వస్తే మా పరిస్థితి ఏంటి అంటూ ఊరంతా కంగారు పడుతున్న సమయంలో.. అదే ఊళ్లో ఉన్న భూషణం (అజయ్ ఘోష్), డానియల్ (ఆటో రామ్ ప్రసాద్), బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్) జనాల భయాన్ని, మూడ నమ్మకాల్ని అడ్డం పెట్టుకుని డబ్బును దోచేయాలని రంగంలోకి దిగుతారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి జాబ్ మానేసి ఊళ్లోకి వచ్చేస్తాడు శివ (కార్తికేయ). తను ప్రేమించిన ప్రెసిడెంట్ కుమార్తె చిత్ర (నేహా శెట్టి)ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది.. అనేది అసలు కథ..

కథనం:

యుగాంతం నేపథ్యంలో ఇప్పటికే చాలా కథలు వచ్చాయి.. కానీ బెదురులంక మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. ఆ నేపథ్యంలో కథ ఉన్నా కూడా పూర్తిగా జనాల అమాయకత్వం, వాళ్ల మూఢ నమ్మకాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసాడు దర్శకుడు క్లాక్స్. అక్కడ్నుంచి సిచ్యువేషనల్ కామెడీ రాబట్టుకున్నాడు. అదే ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. దేవుడి పేరుతో దోపిడీ మొదలైన తర్వాత కథలోనూ ఆసక్తి మొదలవతుంది.. అక్కడ్నుంచే వినోదం కూడా ఊపందుకుంటుంది. కార్తికేయ కారెక్టర్ ఊళ్లోకి ఎంట్రీ ఇచ్చాక పరుగులు పెడుతుంది. చావు భయం మనిషిని ఎంత దారుణంగా దిగజారుస్తుందనేది చూపించాడు దర్శకుడు క్లాక్స్. 2012 యుగాంతం గురించి కథనాలు ఎన్నో విన్నాం.. ఆ నేపథ్యమే బెదురులంక సినిమా. కాన్సెప్ట్ అదే అయినా కథ అంతా మూఢనమ్మకాల చుట్టూ తిరుగుతుంది. పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగడం.. ఆ నేపథ్యంలో వర్కౌట్ అయిన సిచువేషనల్ కామెడీ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఎంత కాస్త నెమ్మదిగా.. పెద్దగా బోర్ కొట్టకుండా సాగుతుంది. కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ విచ్చేసింది. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు నాన్ స్టాప్ నవ్వులు పూయించాడు దర్శకుడు క్లాక్స్.

నటీనటులు:

కార్తికేయ బాగా నటించాడు. ఉన్నంతలో చాలా వరకు బాగా కామెడీ చేసాడు కూడా. నేహా శెట్టి ఓకే.. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసారు. ఇక అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగర్, ఆటో రాంప్రసాద్ యాక్టర్స్ బాగా పేలాయి. ప్రెసిడెంట్‌గా గోపరాజు రమణ బాగా నవ్వించారు. అలాగే కసిరెడ్డి పాత్రలో రాజ్ కుమార్ కసిరెడ్డి కూడా చివర్లో అదరగొట్టాడు. సత్య, వెన్నెల కిషోర్ ఉన్నది కాసేపే అయినా బాగా చేసారు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

మణిశర్మ పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఉన్న పాటల్లో వెన్నెల్లో ఆడపిల్ల ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఓకే.. చివరి 40 నిమిషాలు అయితే చాలా హిలేరియస్‌గా వర్కవుట్ అయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు క్లాక్స్ పదేళ్ల కింది ఇన్సిడెంట్ తీసుకున్నా కూడా చాలా ఫన్నీగా దాన్ని ప్రజెంట్ చేసాడు. ముఖ్యంగా లేనిపోని డాబు చూపించకుండా హాయిగా కథలోని కామెడీని వర్కవుట్ చేసాడు.. అక్కడే సక్సెస్ అయ్యాడు.

Comments


bottom of page