top of page

🔥ఓటీటీలో ‘హిడింబ’కు సూపర్‌ రెస్పాన్స్‌.. క్లైమాక్స్ ట్విస్ట్‌ అదిరిపోయింది..🔥

📺 బిగ్‌ స్క్రీన్‌పై ఆకట్టుకోని హిడింబ ఓటీటీలో మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆగస్టు 23 వరకు ఈ సినిమాకు ఏకంగా 150 మిలియన్ నిమిషాలకు పైగా స్ట్రీమింగ్‌ వ్యూస్ వచ్చాయి.

ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది ఆహా ఓటీటీ. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఈ సినిమాకు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తుందని అందులో పేర్కొన్నారు. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌స్‌ బ్యానర్‌పై శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమాస్‌ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్‌ హిడింబ సినిమాను నిర్మించారు. ఏక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత అనిల్‌ సుంకర ఈ సినిమాను సమర్పించారు. అశ్విన్‌, నందితో పాటు శ్రీనివాసరెడ్డి, మకరంద్‌ దేశ్ పాండే, విద్యుల్లేఖ రామన్, రాజీవ్ కనకాల, రఘు కుంచె, సంజయ్ స్వరూప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బాడిస వికాస్‌ స్వరాలు సమకూర్చారు.** 🎬

Kommentit


bottom of page