top of page
Suresh D

ఇది సిగ్గు పడాల్సిన విషయం: హీరో నిఖిల్

ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మనం ఇలాంటి ఫలితాలు సాధించాడం ఏంటని ప్రశ్నించారు. ఇందుకు భారత ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గుపడాలని విమర్శించారు. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చాలంటూ కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఐఎఫ్సీకి ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


bottom of page