top of page

టాలీవుడ్ కి ఈ ఏడాది సక్సెస్ దొరకడంలేదు అసలు ఏం జరుగుతుంది..? 🎬

2024లో ఇప్పటి వరకు టాలీవుడ్ కి ఏ సినిమా పెద్ద సక్సెస్ కాలేదు. ఈ ఆరు నెలల కాలంలో 100కి పైగా సినిమాలు రిలీజ్ అయినా, ఒక్కటీ కమర్షియల్ గా విజయం సాధించలేదు. వీకెండ్ మాత్రమే సినిమాలు కొంచెం కలెక్షన్స్ రాబడుతున్నాయి, తరువాత థియేటర్స్ ఖాళీ అవుతున్నాయి.

గత నెల విడుదలైన సినిమాలలో ఏదీ బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించలేదు. "మనమే" సినిమా బాగుందనే టాక్ తెచ్చుకున్నా, థియేటర్స్ లో కలెక్షన్స్ రాలేదు. "సత్యభామ" సినిమా మూడు రోజుల్లోనే తేలిపోయింది. ఈ వారం సుధీర్ బాబు "హరోం హర" వచ్చింది, యావరేజ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ సేతుపతి డబ్బింగ్ మూవీ "మహారాజా" పాజిటివ్ రివ్యూలు వచ్చాయి కానీ థియేటర్స్ నిండలేదు. మౌత్ టాక్ తో "మహారాజా" ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు.

"హరోం హర" సుధీర్ బాబు కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో వచ్చింది కానీ మొదటి రోజు కలెక్షన్స్ పెద్దగా రాలేదు. జూన్ 27న ప్రభాస్ "కల్కి 2898 AD" గ్రాండ్ స్కేల్ పై రిలీజ్ అవుతుంది.

మూవీలు ఓటీటీలోకి వచ్చాక ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. "కల్కి 2898 AD" లాంటి పెద్ద సినిమాలు వచ్చినపుడు మాత్రమే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు. "మహారాజా" క్లిక్ అయితే తెలుగు హీరోలు తమ కథల ఎంపిక మార్చుకోవాల్సి ఉంటుంది.

సినీ విశ్లేషకుల మాటల ప్రకారం, ప్రతి నెల ఒక పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతుండటంతో థియేటర్స్ లో కొంత సందడి ఉండొచ్చని అంటున్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page