top of page
Suresh D

🔮🌟నేటి రాశి ఫలాలు..ఈ రాశుల జాతకులు శుభవార్తలు వింటారు🌟🔮

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 23.01.2024 మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.🌟🔮

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కుటుంబముతో సంతోషంగా ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మంచి నిర్ణయాలతో అన్నింటా విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పనులు పూర్తవుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల సహకారం అందుతుంది. సహ ఉద్యోగులతో స్నేహంగా ఉంటారు. బంధువులతో కార్యసిద్ధి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. రాజకీయ, కోర్టు పనులలో ఫలితాలు అనుకూలం. ఆదాయం అస్థిరం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. సమయస్ఫూర్తితో విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఊహించని ఖర్చులు, ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. శుభవార్త వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఖర్చుల నియంత్రణ అవసరం. మరింత శుభ ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉంది. భూమి కొనుగోలు ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. రోజువారి కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపార విస్తరణలో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. మరింత శుభ ఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. విహారయాత్రలకు వెళతారు. కొత్త పనులు ప్రారంభించడం పై మనసు నిలుపుతారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. అన్నదమ్ములతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వ్యాపారులకు మంచి సమయం. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వెలువడుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. శుభవార్త వింటారు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు. పదోన్నతి, అనుకూల స్థాన చలన సూచనలున్నాయి. గృహ నిర్మాణం, ఇంటి మరమ్మత్తులు చేపట్టే అవకాశాలున్నాయి. తీర్థ యాత్రలు చేపడతారు. భూ లావాదేవీల్లో లాభాలు అందుకుంటారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది. ప్రయాణాల్లో కార్య సాఫల్యం ఉంది. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సమయానుకూలంగా పూర్తవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. స్నేహితుల వల్ల కార్యసిద్ధి ఉంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మరింత శుభ ఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. అధికారులతో సఖ్యత నెలకొంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. బంధువర్గంతో కార్యసిద్ధి ఉంది. అన్నదమ్ములతో అనుబంధం పెరుగుతుంది. వాహనం, భూముల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మరింత శుభఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉత్సాహంగా ఉంటారు. నూతన బాధ్యతలను సంతోషంగా స్వీకరిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య సఖ్యత నెలకొంటుంది. కుటుంబముతో సంతోషంగా కాలం గడుపుతారు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారుల అండ దండలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. స్థిరచరాస్తుల విషయంలో తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. బంధువర్గంతో సత్సంబంధాలు నెలకొంటాయి. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వివాదాలమూలంగా మనశ్శాంతి లోపిస్తుంది. సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆరోగ్యంపై శద్ధ వహిస్తారు. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. కుంభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుడిని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. శుభకార్యాలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నలుగురికీ ఉపయోగపడే పనులపై మనసు నిలుపుతారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి స్థాయిలో నిలుస్తారు. విదేశీ విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు రావలసిన డబ్బు వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దూర ప్రయాణాలతో కార్యసిద్ధి ఉంది. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్దాదేవిని పూజించండి.

bottom of page