top of page

🔮🌟నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులకి అన్ని రంగాలలో కలిసొస్తుంది🌟🔮

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 25.01.2024 గురువారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.🌟🔮

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల సమయం. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పిల్లల ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం వల్ల సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. దుబారా ఖర్చులు విపరీతంగా చేస్తారు. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అధ్యాత్మికత పెరుగుతుంది. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. సాయం ఆశించవద్దు. ఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది. మీ శక్తియుక్తులపై నమ్మకం ఉంచండి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యవహారాలతో సతమతమవుతారు. శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలసి వస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఓర్పుతో ప్రయత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గృహ మరమ్మత్తులు చేపడతారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. బ్రాహ్మణులకు గాని ముత్తైదువులకి గాని తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాల వికటిస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికమగుతాయి. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోవాలి. అరోగ్యం అనుకూలించును. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. శివపార్వతులు అర్థానరీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమని అనిపించవు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. మీ సిఫార్సులో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. కళాత్మక పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కీలక విషయాలు వెల్లడించవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. అధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవదర్శనాలు ఉల్లాసాన్నిస్తాయి. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బృహస్పతి అనుగ్రహం కోసం బ్రాహ్మణులకు గాని ముత్తైదువులకిి శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది కీలక పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. సన్నిహితులకు సాయం చేస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. శివపార్వతులు అర్థానారీశ్వరునీ రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వస్త్ర ప్రాప్తి లభిస్తుంది. వాహనసౌఖ్యం. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. గృహమార్పు కలసి వస్తుంది. నగదు, పత్రాలు జాగ్రత్త. ప్రయాణంలో చికాకులు తప్పవు. పోటీలు, పందాలు ఉల్లాసాన్నిస్తాయి. వ్యవహారాలు మీ అధ్వర్యంలో సాగుతాయి. మీ విజ్ఞతకు సముచిత గౌరవం లభిస్తుంది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. పెద్దల సలహా తీసుకోవాలి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. మీ సాయంతో ఒకరికి మంచి జరగుతుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. వ్యాపాకాలు అధికమవుతాయి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తైదువులకి తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మీ భాగస్వామికి అన్ని విషయాలు తెలియచేయండి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళు స్వీకరిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఇంటి విషయాలపై శ్రద్ద వహించండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. ఆచితూచి అడుగు వేయాలి. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అన్ని రంగాల వారికి అనుకూలం. విలాసాలకు ఖర్చు చేస్తారు. ఆప్తుల రాక ఆనందాన్నిస్తుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. మీ సిఫార్సులో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అప్రమత్తంగా ఉండవలసిన సమయం. తొందరపాటు నిర్ణయాలు తగవు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త, పనులు హడావిడిగా సాగుతాయి. కార్యక్రమాలు సాగవు. పిల్లల దూకుడు అదుపుచేయండి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page