top of page

నేటి రాశి ఫలాలు.. మౌని అమావాస్య ఈ రాశులకు అదృష్టం తెచ్చింది✨🔮

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ09.02.2024 శుక్రవారం మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.✨🔮

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులకు కాలం కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణకు మంచి సమయం. విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం అవకాశాలు రావచ్చు. ఆర్థికంగా మధ్యస్థంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు మంచి సమయం. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. అధికారుల అండదండలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రయాణాలు కలసివస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థాన చలన సూచన. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. భూలావాదేవీలు కలసివస్తాయి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. వ్యాపార ఒప్పందాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండుట మంచిది. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కుటుంబముతో సంతోషంగా గడుపుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ద వహిస్తారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారులకు మంచికాలం. లక్ష్మీఅష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం అనుకూలించును. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. అనుకున్న పనులు నెరవేరతాయి. కార్య సాఫల్యం ఉంది. ఆర్థికంగా కలసివస్తుంది. సమయానుకూల నిర్ణయాలతో ముందుకు సాగుతారు. మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. కుటుంబ పెద్దల సహకారం పొందుతారు. తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ పనులలో కాలయాపన జరుగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా రావచ్చు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉంటారు. పదోన్నతి, అనుకూల బదిలీ ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి పేరు సంపాదిస్తారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులు శ్రద్దతో పూర్తిచేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం వస్తుంది. బంధువులతో కార్య సాఫల్యం ఉంటుంది. ఉద్యోగులకు అనుకూల సమయం. అధికారుల అండదండలుంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. ఆరోగ్యం అనుకూలం. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారంలో రావలసిన సొమ్ము ఆలస్యంగా అందటంతో కొన్ని పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రమతో లక్ష్యాలు పూర్తిచేస్తారు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూ లావాదేవీలు కలసివస్తాయి. శుభకార్య ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉదోగ్య ప్రయత్నాల్లో ఉన్నవారు శుభవార్త వింటారు. కొత్త వస్తువులు కొనుగోలుచేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. గౌరవమర్యాదలకు లోటుండదు. పదోన్నతి, బదిలీలు ఉండవచ్చు. ఉత్సాహంగా పనులు చేస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెడతారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బరువు, బాధ్యతలు పెరిగినా సంతృప్తిగా ఉంటారు. వ్యాపారులకు ఒప్పందాలు అనుకూలిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. వాహనం వల్ల పనులు నెరవేరుతాయి. అయితే వృథా ఖర్చులతో ఇబ్బందులు రావచ్చు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలుంటాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగులకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. శుభవార్త వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ పనులలో పురోగతి ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

bottom of page