top of page

నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు అంచనాలకు మించి ఖర్చు చేస్తారు🌟👀

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ07.02.2024 బుధవారం మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.🌟👀

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. రుణ సమస్యలు తొలగుతాయి. సంతోషంగా గడుపుతారు. ఖర్చులు అధికమగును. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. ఆరోగ్యం అనుకూలించును. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. వాయిదాపడిన మొక్కలు తీర్చుకుంటారు. విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లాన్ని నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు అనుకూలంగా లేవు. ఆశావహ దృక్పథంతో మెలగాలి. ప్రయత్నాలు విరమించుకోవద్దు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మీ అశక్తతను అయినవారు అర్థం చేసుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వేడుకకు హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి. వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. బెట్టింగులకు పాల్పడవద్దు. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి నేటి దిన ఫలాలు అనుకూలంగా లేవు. విలాసాలకు ధనం అధికంగా ఖర్చుచేస్తారు. ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. నగదు, పత్రాలు జాగ్రత్త. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయండి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ప్రయాణాలు విరమించుకుంటారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన అలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం వల్ల శుభం జరుగుతుంది. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అన్యమనస్కంగా గడుపుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పట్టుదలతో ప్రయత్నాలు చేస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పట్టుదలకు పోవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. అసాంఘిక కార్యక్రమాల జోలికి పోవద్దు. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వేంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం, వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలం. ఉల్లాసంగా గడుపుతారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ధనలాభం, వస్త్ర ప్రాప్తి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పనులు సానుకూలమవుతాయి. వేడుకకు ఆహ్వానిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గుంభనంగా మెలగండి. సమిష్టి కృషితో అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. పనులు సానుకూలమవుతాయి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పిల్లల విజయం ఉత్సాహాన్నిస్తుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం, చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. మీ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుంది. మొండిబాకీలు వసూలవుతాయి. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. పెట్టుబడులు కలిసివస్తాయి. వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. పెద్దల సలహా పాటించండి. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. లావాదేవీలతో తీరిక ఉండదు. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి నేటి రాశి ఫలాలు అనుకూలంగా లేవు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వస్తులాభం, వస్త్రప్రాప్తి పొందుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు. అందోళన తగ్గి కుదుటపడతారు. సోదరులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. వెంకటేశ్వర సుప్రభాతం చదవడం, వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి

ధనూ రాశి వారికి నేటి దిన ఫలాలు మధ్యస్తంగా ఉన్నాయి. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. అయిన వారి సాయం అందుతుంది. రావనుకున్న బాకీలు వసూలవుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. భేషజాలకు పోవద్దు. ఆచితూచి అడుగేయాలి. సన్నిహితుల సలహా తీసుకోండి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఒక సమాచారం సంతోషాన్నిస్తుంది. ఆప్తులను వేడుకకు ఆహ్వానిస్తారు. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. మీ ఇష్టాఇష్టాలను స్పష్టంగా తెలియచేయండి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. నగదు, అభరణాలు జాగ్రత్త. సామరస్యంగా మెలగండి. పోటీల్లో విజయం సాధిస్తారు. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు జాతక ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. మీ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. ఆప్తులకు ఖరీదైన కానుకలిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఫోన్‌ సందేశాలను పట్టించుకోవద్దు. ప్రతి విషయం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల శుఖభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రుణ ఒత్తిళ్ళు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు అధికం. వేడుకను ఘనంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పరించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

bottom of page