top of page

✨నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఈరోజు అనుకూలంగా లేదు🌟🔮

 నేటి దిన ఫలాలు (రాశి ఫలాలు) తేదీ 08.01.2024 సోమవారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 🌟🔮

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా ఉద్యోగంలో ప్రశంసలందుకుంటారు. ముఖ్య కార్యాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మేషరాశివారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు,ధనాన్ని పొందుతారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారస్థులకి వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నా సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఇబ్బంది పెట్టేవారుంటారు. ఎవరి మాటలూ మనసుకు తీసుకోవద్దు. లోతుగా ఆలోచించవద్దు. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో పాటు108సార్లు శివనామస్మరణ చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ అజాగ్రత్త వల్ల పత్రాలు,విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. ఆర్థిక,వ్యాపార విషయాలు రహస్యంగా ఉంచండి. శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుండి బయటపడతారు.శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి సలహాతో ఒక సమస్య నుంచి బయటపడతారు. స్త్రీలు షాపింగ్‌ కోసం ధనం ఖర్చుచేస్తారు. సంగీత,సాహిత్య కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచి శ్రమించండి. కొబ్బరి,పండ్లు,పూల వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తినా లాభదాయకంగా ఉంటుంది. కర్మాటక రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన,పంచాక్షరీ జపం చేస్తే మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. విదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు వాయిదాపడతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. స్త్రీల కోరికలు,అవసరాలు నెరవేరుతాయి. రాజకీయ నాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు. క్రయ విక్రయాలు జోరుగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఒత్తిడి,చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అవగాహన లేని విషయాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. తలపెట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. విద్యార్థులకు వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం. ఉమ్మడి వ్యవహారాలు,ఆర్ధిక లావాదేవీలు అనుకూలిస్తాయి. బేకరీ,స్వీట్లు,పూల,పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి కనిపిస్తుంది. ప్రైవేటు ఫైనాన్సులో పొదుపుచేయడం మంచిది కాదని గమనించండి. శివాష్టకం పఠించండి. ఈశ్వరుడిని పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలో మెళకువ అవసరం. స్త్రీల అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచటం మంచిది. ప్రైవేటు ఫైనాన్సులో మదుపు చేయడం మంచిది కాదని గమనించండి. పంచాక్షరీ మంత్రంతో18సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. స్రీలకు ఇంటి వాతావరణం చికాకు కలిగిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. మీ కదలికలపై కొంతమంది నిఘా వేసారన్న విషయాన్ని గమనించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన వస్తుంది. ధనూ రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. దీర్ణకాలిక సమస్యలకు మంచి పరిష్కార మార్గం గోచరిస్తుంది. స్రీలకు గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. కొత్త వ్యక్తులను దరిచేరనీయకండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీ మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. దూరప్రయాణాలు విసుగు కలిగిస్తాయి. రుణం తీర్చి తాకట్టు పెట్టిన వస్తువులను విడిపిస్తారు. వస్త్ర,ఫ్యాన్సీ,పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. అర్థాంతరంగా నిలిచిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వల శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. కుటుంబీకులకు, బంధువుల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతాయి. స్త్రీలపై శకునాలు, చుట్టుపక్కలవారి వ్యాఖ్యలు తీవ్రప్రభావం చూపుతాయి. వాణిజ్య ఒప్పందాలు, సంతకాలు, హామీల విషయంలో ఏకాగ్రత అవసరం. బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో పరమేశ్వరుడిని పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page