top of page

🌟 జనవరి 5, 2024 నేటి రాశి ఫలాలు: వీరికి మిత్రుడి సాయం అందుతుంది 🌅

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 05.01.2024 శుక్రవారం మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 🌌

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఒకరి మాటతీరుతో ఇబ్బందిపడతారు. మౌనం అన్ని విధాలా శ్రేయస్మరం. ఆత్మీయులు, బంధువుల నుండి వచ్చిన పిలుపుతో ప్రయాణాలకు సిద్ధపడతారు. ఆర్థికంగా పర్వాలేదు. ఇతరుల విషయాలపై ఆసక్తి. విద్యావకాశాల కోసం కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. తరతమ భేదం లేకుండా సాయం అందిస్తారు. కొంతకాలంగా ఇబ్బందిపెడుతున్న ఒక సమస్య కొలిక్కి వస్తుంది. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. వివాదాలేర్పడే అవకాశాలున్నాయి. ప్రయాణాలు చేస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

మిథునరాశి

మిథునరాశి వారికి నేటి దిన ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారపరంగా సత్‌ఫలితాలున్నాయి. రాబడి విషయంలో హెచ్చుతగ్గులున్నాయి. బంధువర్గ సలహాలు, సూచనలు తీసుకోవాలి. కీలక విషయంలో ముఖ్యులతో జరిపిన చర్చలు ఫలిస్తాయి. వివిధ మార్గాల్లో పొదుపు చర్యలు పాటిస్తారు. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయి. వాహన, గృహ కొనుగోలుపై చేస్తున్న చర్చలు ఫలిస్తాయి. వృత్తులు, వ్యాపారాలు, కళాకారులకు తమ రంగాల్లో రాణిస్తారు. ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. ఎవరి సాయం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. మనోనిబ్బరంతో కొన్ని వ్యవహారాలు పూర్తిచేస్తారు. ఎవరు కాదన్నా మీ మార్గాన్ని వీడరు. కుటుంబసభ్యులు మీపై పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు అనుకూలంగా ఉన్నవి. నిరుద్యోగుల కృషి పట్టుదల ఫలిస్తుంది. రాదనుకున్న సొమ్ము అందవచ్చు. ఇంటి నిర్మాణాలపై అంచనాకు వస్తారు. ఎదుటివారిని ఆకట్టుకుంటారు. భూముల క్రయవిక్రయాలపై ఒక నిర్ణయానికి వస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. కొన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. రాబడి విషయంలో ఆశలు ఫలిస్తాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారపరంగా గతం కంటే కొంత మెరుగైన సమయం. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా. ఎవరి మెప్పుకోసం ఆశపడరు. ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

తులారాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. స్వయంగా కొన్ని ఉపాధి మార్గాలు ఎంచుకుంటారు. వాహనాలు లేదా గృహం కొనాలన్న సంకల్పం వాయిదా పడుతుంది. ఏదో తొందరపడి ఒక నిర్ణయానికి రారు. వృత్తి వ్యాపారపరంగా మెరుగైన ఫలితాలున్నాయి. మీ జీవనం కొనసాగింపులో ఒక మిత్రుని సాయం అందుతుంది. అనుకున్న కార్యక్రమాలు వెంటనే ప్రారంభిస్తారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ప్రతి అవసరానికి ఇతరులపై ఆధారపడవలసిన పరిస్థితి. స్థిరాస్తులపై మీకున్న హక్కులు పొందడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. అనారోగ్యాలను దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలి. అత్యాశ నిర్లక్ష్యం వీడాలి. శుభవార్త వింటారు. కొద్ది మొత్తంలో ధనలబ్ధి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి

ధనూరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం. ఎంతటి కార్యక్రమాన్నైనా నేర్పుగా పూర్తి చేస్తారు. వ్యాయామం, ఆహారనియమాల ద్వారా ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు. ఒక సంఘటన జీవిత పాఠాన్ని నేర్పుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆదాయ మార్గాలు మెరుగుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్లశుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. మీ జీవిత రహస్యాలను బహిర్గతం చేయొద్దు. వాహన సౌఖ్యం. శుభవర్తమానాలు ఉండును. ఊహించని ఆహ్వానాలు. ఒక సమాచారం మనోవేదన కలిగించే వీలుంది. ఆత్మ విశ్వాసం వీడొద్దు. బలహీనతలను గుర్తించేందుకు కొందరు ఎదురుచూస్తుంటారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

కుంభ రాశి

కుంభరాశి వారికి నేటి దిన ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఎంతటి సమస్య అయినా తేలిగ్గా పరిష్కరిస్తారు. ఆదాయం విషయంలో ఇబ్బంది ఉండదు. కొన్ని స్థిరాస్తులు, వాహనాలు కొనే ప్రయత్నాలు చేస్తారు. ఒక బంధువు ద్వారా శుభవార్తలు. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఆప్తులను సంప్రదించండి. వ్యాపారుల, రాజకీయ వర్గాల చిరకాల మనోవాంఛ ఫలిస్తుంది. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి నేటి రాశి ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయి. ముఖ్యమైన పనులు స్వశక్తితో పూర్తిచేస్తారు. రాబడి మెరుగుపడుతుంది. స్థిరాస్తులు, షేర్ల వ్యాపారులకు ఆశించిన ప్రయోజనాలుంటాయి. జీవిత భాగస్వామితో వివాదం సమసిపోతుంది. దూరప్రాంతాల నుండి ఉపయుక్తమైన సమాచారం. ఒక సందర్భంలో భావోద్వేగానికి లోనవుతారు. వృత్తి వ్యాపారపరంగా అనుకూలం. వృథా ఖర్చులుండును. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

Yorumlar


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page