top of page

🔮🌟నేటి రాశి ఫలాలు.. తోటివ్యక్తులతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది🔍 🔮

నేటి రాశి ఫలాలు తేదీ 30.12.2023 శనివారం . మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మేష రాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీరు అనుకున్నట్టుగా ప్రణాళికపరంగా పనులు ముందుకు వెళ్ళిపోతాయి. ఆకస్మిక ఖర్చులు, ప్రయాణాలు కొంత మానసిక ఇబ్బందికి గురిచేస్తాయి. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సంతానానికి సంబంధించి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ కష్టపడకుండానే ఆశించిన విజయాలను అందుకుంటారు. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బంధువుల రాక ఆకస్మిక ఖర్చులు, ఒత్తిడి, శ్రమ, ఇష్టమైన వస్తువుల కొరకు అధికంగా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో చర్చించి వృత్తిపరంగా నూతన పథకాలు. నిర్ణయాలు చాలా త్వరితంగా తీసుకుంటారు. ఆత్మీయుల ద్వారా ఆదాయము అభివృద్ధి ఉంటుంది. రావలసిన ధనములో ఆలస్యాలు ఉంటాయి. దేవాలయాల సందర్శన కూడా ఉంటుంది. నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు జరుగుతాయి. చిన్ననాటి మిత్రుల సమావేశాలు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఆలోచనలు సాగిస్తారు. ట్యాక్స్‌ చెల్లిస్తారు. ప్రశాంతత లోపిస్తుంది. చేస్తున్న వృత్తిలో కొత్త వ్యక్తుల జోక్యము సలహాలు ఇబ్బంది కలిగిస్తాయి. జీవిత భాగస్వామికి వృత్తిపరమైన ఒత్తిడి. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు గట్టిగా చేస్తారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పనులు ముందుకు సాగుతాయి. కంటి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఉంటాయి. ప్రయాణములలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక నిర్ణయములు తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది. భాగస్వామికి వృత్తిలో ఆదాయ అభివృద్ధి ఉంటుంది. ప్రీ సంతానానికి సంబంధించి విద్య, వృత్తి అభివృద్ధి, వివాహమునకై మీరు చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. తల్లిదండ్రుల ఆశీస్సులతో నూతన ప్రణాళికలు చేపడతారు. ఆదాయం అభివృద్ధి ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు గౌరవం లభిస్తుంది. మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భాగస్వామికి వృత్తిపరంగా నూతన అవకాశములు ఉంటాయి. విదేశీ విద్య కొరకు కొంతమేర అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు ఆచితూచి అడుగు వేయాలి. తోటివ్యక్తులు ఈర్ష్యతో ఇబ్బంది పెట్టే అవకాశములు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఒక సలహా కొరకు ముఖ్య బంధువులను కలుస్తారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. రుణములు చెల్లించుటలో ప్రణాళికాపరముగా వెడతారు. పుణ్యక్షేత్ర సందర్శనలు దగ్గర ప్రయాణాలు లాంటివి చేస్తారు. కొత్త వ్యక్తులతో మెలిగేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. ముఖ్యమైన నిర్ణయాల విషయంలోనే, ఆరోగ్య విషయంలోనూ తొందరపాటు పనికిరాదు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. రావలసిన రుణములు ఆలస్యమగును. చిన్నపాటి అనారోగ్యాలు ఇబ్బందిపెడతాయి. బంధువులలో కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. గుర్తింపు గౌరవాన్ని పొందుతారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. తోబుట్టువుల సహకారాన్ని కోరుకుంటారు. ఆలోచనలు కొంచెం మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతారు. మిత్రులతో కలసి విహారయాత్రలు చేస్తారు. సాంఘిక బంధాలు బలపడతాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యవసాయానికి సంబంధించిన విషయాలపై దృష్టి సారిస్తారు. గృహములో వాతావరణం ప్రశాంతత తక్కువగా ఉంటుంది. విద్యార్థులకు విద్యాపరంగా శ్రద్ధ అధికము చేయాలి. జ్ఞాపకశక్తిని పెంచుకున విధంగా కృషి చేయాలి. తగిన గుర్తింపు గౌరవం లభిస్తుంది. ఆత్మీవిశ్వాసం పెరుగుతుంది. పోటీలలో నెగ్గుతారు. అనవసర ఖర్చులను అదుపు చేసుకోవాలి. ఆహార విషయంలో శ్రద్ధ వహించుట మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తిలో నాయకత్వం, గౌరవము బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బందిపెట్టే వ్యక్తుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆత్మీయ వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు లేకుండా నిర్ణయాలు తీసుకొనుట మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకోవాలి. వాయిదాపడిన ముఖ్యమైన పనులు కొంతవరకు ముందుకు సాగుతాయి. చిన్నపాటి ప్రయాణాలకు అవకాశముంది. ధైర్యంగ నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువులు సహకరిస్తారు. రుణములు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు వహించాలి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ విషయాలలో కొంత చికాకులు కలుగును. ఇతర వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. నూతన వ్యక్తుల పరిచయాలతో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. సంతానమునకు సంబంధించిన ఖర్చులు. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఆలోచనలు. పలుకుబడి కలిగిన మిత్రుల సహకారం. సోదరవర్గంతో సమావేశాలు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆర్థిక విషయాల్లో కొంత చికాకుగా ఉంటుంది. మిత్రులు సమయానికి సహకరిస్తారు. ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. గవర్నమెంట్‌కి సంబంధించిన పన్నులు చెల్లిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసిన సేవలకు గుర్తింపు లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత అంశములపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ముఖ్య వార్త అందుకుంటారు. నూతన గృహ నిర్మాణం, వాహనాల కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తిపరంగా ఆకస్మిక ప్రయాణాలు. మానసికంగా తగిన విశ్రాంతి అవసరం. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఆర్థిక అంశాలలో తోబుట్టువులు సమయానికి సహకరిస్తారు. కమ్యూనికేషన్‌ బాగుంటుంది. అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనకై ఆలోచనలు చేస్తారు. కుటుంబములోని పెద్దలతో బేదాభిప్రాయములు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page