top of page

జనవరి 13, 2024.. ఈరోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే..

నేటి దిన ఫలాలు (రాశి ఫలాలు) తేదీ 13.01.2024 శనివారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. ఇతరులతో వాదనలు కలసిరాకపోగా మానసిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంటుంది. సద్గుణాలను పెంచుకుని ఆధ్యాత్మికంగా సాగటం వలన ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలు కలసి వస్తాయి. ఆకస్మిక ధనలాభంతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. దూర ప్రయాణములు వాయిదా వేయుట మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడపడం వలన మనశ్శాంతి లభిస్తుంది. ఉద్యోగం ఆశించేవారికి తక్షణమే అనుకూలం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిథున రాశి

మిధున రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు. వైద్య సలహాలు తీసుకోవాలి. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. విలాసవంతమైన జీవితం కలిగి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. చట్టపరమైన ఇబ్బందులు కలుగును. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్ట్రకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలతో సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు కలసిరావు. చెడు సహవాసాలకు దూరంగా ఉండండి. తోటి ఉద్యోగులతో వివాదాలు వస్తాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం ఇది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. పిల్లల విషయంలో సంతోషం. ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. పరీక్షలలో విజయం సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. స్నేహితుల నుండి లాభదాయకం. వ్యాపార వృద్ధి, శత్రు జయం. శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. అధికార యోగం వస్తుంది. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాఖిషేకం చేసుకోవడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వ్యాపార వృద్ధి. శుభవార్తలు వింటారు. ప్రభుత్వం ఉండి సహాయం కలుగుతుంది. మీ తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం అనుకూలించును. వివాహ అవకాశాలు. సంపద వృద్ధి. విద్యలో విజయం. ఆనందంగా గడుపుతారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందిస్తాయి. మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మీకు విలువ గౌరవం ఇస్తారు. ధైర్యంగా ముందడుగు వేస్తారు. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వివాహ అవకాశాలు, వినోదం, వ్యాపారంలో వృద్ధి. మంచి ఫలితాలను పొందుతారు. సంపద కలుగును. ఆనందంగా గడుపుతారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. భూమి లేక గృహం స్థిరాస్తులను పొందుతారు. అన్నింటా విజయం మీదే. మీరు సాధించే ప్రతి పనిలోను మీ స్నేహితుల ప్రమేయం ఉంటుంది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్ట్రకాన్ని పఠించంది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. అధిక లాభాలు ఆర్జిస్తారు. అనేక మార్గాల నుండి ఆదాయం పెరుగుతుంది. విందు వినోదాలకు శుభకార్యాలకు వెళతారు. సమస్త ఐశ్వర్యాభివృద్ధి ప్రాప్తి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page