top of page
Suresh D

నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల జాతకులు శుభకార్యాలకి శ్రీకారం చుడతారు✨🔮

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 30.01.2024 మంగళవారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.✨🔮

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. పనులు హడావిడిగా సాగుతాయి. కుటుంబీకులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. పత్రాలు అందుకుంటారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీ కష్టం మరొకరికి లాభిస్తుంది. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. ఫోన్‌ సందేశాలను పట్టించుకోవద్దు. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు సానుకూలమవుతాయి. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలించును. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథున రాశి

మిథున రాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పట్టింపులకు పోవద్దు. ఆచితూచి అడుగేయాలి. మీ నుంచి విషయ సేకరణకు కొందరు ప్రయత్నిస్తారు. గుట్టుగా మెలగండి. మీ భాగస్వామి సలహా తీసుకోండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెట్టుబడులకు సమయం కాదు. పిల్లల చదువులపై శ్రద్ద వహించండి. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. నోటీసులు అందుకుంటారు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. పనుల్లో ఒత్తిడి చికాకులు అధికం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఒక సంబంధం కలసి వచ్చే సూచనలున్నాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. మరింత శుభ ఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సంప్రదింపులు ఫలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. స్థల స్థాపనలపై దృష్టిపెడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో శుభం జరుగుతుంది. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. తీర్థయాత్రలు, కొత్త ప్రదేశాలకు సన్నాహాలు సాగిస్తారు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యానికి శ్రీకారం చుడతారు. రావలసిన ధనం అందుతుంది. గృహంలో మార్పు చేర్పులకి అనుకూలం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉత్సాహంగా గడుపుతారు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు ప్రయత్నిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పిల్లల చదువులపై జాగ్రత్త వహించండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. సమష్టి కృషితో లక్ష్యం సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పనులు సాగవు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మరింత శుభ ఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవి పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. అప్రయత్నంగా అవకాశాలు కలసివస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. రెట్టించిన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ధనలాభముంది. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. వాస్తు దోష నివారణ చర్చలు చేపడతారు. మీ సిఫార్సుతో ఒకరికి మేలు జరుగుతుంది. మరింత శుభఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వస్త్ర ప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సంబంధాలు బలపడతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. లక్ష్య సాధనకు ఓర్పు ప్రదానం. బంధుమిత్రుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. పరిచయస్తులే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియచేయండి. కష్ట సమయంలో ఆప్తులు ఆదుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. భేషజాలకు పోవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ద వహించండి. మీ జోక్యం తప్పనిసరి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. గృహోపకరణాలు మరమ్మత్తుకు గురవుతాయి. విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. రావలసిన ధనం అందుతుంది. కొంత మొత్తం పొదుపు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. పిల్లల చదువులపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆత్మీయుల రాక సంతోషాన్నిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

bottom of page