top of page
Suresh D

నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల జాతకులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి🌟🔮

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 29.01.2024 సోమవారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.🌟🔮

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. అధికారిక బాధ్యతలు కొత్తవి ఏర్పడును. ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలుంటాయి. పాత విషయాలు గుర్తుంచుకొని మానసిక ఇబ్బందిని పొందుతారు. మేష రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు, ధనాన్ని పొందుతారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. బంధువులు మీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. కుటుంబంతో సంయమనంతో మెలగాలి. పొరపాటునకు బాధ్యత వహించవలసి రావచ్చు. అవసరాలు తీరునట్లుగా ఆదాయాలుంటాయి. నిరాశకు దూరంగా ఉంటూ ప్రయత్నాలను చేయవలసి ఉంటుంది. వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీరు చేయు ప్రయత్నాలు కలసిరావు. పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. సాటివారితో ఆనందాలు పంచుకోలేకపోతారు. యంత్ర వాహనాలు మరమ్మత్తులకు గురి కాగల సూచనలున్నాయి. స్పెక్యులేషన్‌లకు, క్రయవిక్రయాలకు దూరంగా ఉండుట మంచిది. శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. అవసరాల్ని సమర్ధించుకొనునట్లు ఆదాయాలు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపారాల్లో మంచి అవకాశాలు ఏర్పడతాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. కర్మాటక రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన, పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా లౌక్యంగా సాగవలసి ఉంటుంది. అవసరాలకు తగిన ముందు జాగ్రత్తలు పాటించుకోవాలి. వ్యాపారాల్లో పోటీదారులకు దూరంగా ఉండుట మంచిది. స్థిరాస్తి వ్యవహారాలకు దూరంగా ఉండుట మంచిది. చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీరు చేసే పనులు ప్రణాళికాబద్ధంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సమర్థతకు తగిన గుర్తింపు పొందుతారు. మీ ప్రతీ ప్రయత్నం ఉత్సాహంగా సాగి ప్రయోజనాలను ఏర్పరచగలదు. పెట్టుబడులు ఉత్సాహపరచు సూచనలున్నాయి. రావలసిన వాటిపై దృష్టి పెట్టగలుగుతారు. ప్రయాణాలు, ప్రయత్నాలు అనుకున్నట్లుగా సాగుతాయి. కన్యా రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆరోగ్య ఆర్థిక విషయాల్లో మంచి మార్చులు చూడగలుగుతారు. ఆదాయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు చిన్నతరహా ప్రయోజనాలుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో తోటివారి సహాయాలు తీసుకుంటారు. వాహన, భూ గృహ వసతుల ఏర్పాట్లు వంటివి చేసుకోగలుగుతారు. మీదైన తరహాలో పనుల్ని పూర్తి చేసుకోగలుగుతారు. అవకాశాలు కలసివస్తాయి. తులా రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుడిని పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. అవసరాలకు సరిపడా ఆదాయాలు ఉంటాయి. అలాగే అవసరాలు పెరుగుతాయి. బంధుమిత్రులచే విమర్శలను ఎదుర్కోవలసి రావచ్చును. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చూస్తారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండుట మంచిది. వృశ్చికరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మనోధైర్యముతో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల సహకారాలుటంటాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో వకవాక్యతలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. శుభకార్య నిశ్చయాలు వంటివి తుది దశకు చేరుకోగలవు. వృత్తి ఉద్యోగాలలో సాధారణంగా ఉంటుంది. గతంలో విమర్శించినవారే మిత్రులవుతారు. శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. అవసరమైన విషయాలపై దృష్టి పెట్టి సమయాన్ని డబ్బును వృథా చేసుకుంటారు. విలాసాల గురించి ఆలోచిస్తారు. చెప్పుడు మాటల ప్రభావానికి గురికాగల సూచనలున్నాయి. ఆదాయాల వృద్ధికై అప్పులు చేసి పెట్టుబడులు ఉంచగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మనస్సుపెట్టి వ్యవహరించుకోలేకపోతారు. విద్యార్థులు మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అప్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ప్రయత్నాలను వేగవంతం చేసుకోండి. ప్రతి కూలత మాటలు ఉండకుండా జాగ్రత్తలు పాటించుకోండి. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. క్రయవిక్రయాలకు దూరంగా ఉండండి. తెలియని భయానికి గురికాబడి సమయం వృథా చేసుకుంటారు. మనోధైర్యం లేక ఉత్సాహంగా వ్యవహరించుకోలేకపోతారు. కుంభ రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కొన్ని మంచి అవకాశాలు ఏర్పడతాయి. పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆర్థికపరమైన అవసరాలను సమర్ధించుకుంటారు. గత జ్ఞాపకాలు, వ్యక్తుల కోసం ఆరాటపడి భావోద్వేగాలు ఏర్పరచుకొను సంఘటనలు ఉంటాయి. ఆధ్యాత్మికతలకు ఎక్కువ సమయం కేటాయించగలరు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఏర్పడతాయి. తప్పనిసరి దాంపత్య విషయాలకు దగ్గరగా ఉండాలి. బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుడిని పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

bottom of page