top of page

నేటి దిన ఫలాలు.. ఈ రాశుల వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్త, శెనగలు దానం చేయండి

నేటి దిన ఫలాలు (రాశి ఫలాలు) తేదీ 11.01.2024 గురువారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలున్నాయి. బంధువుల సహాయ సహకారాలు అందుతాయి. ఖర్చులు అధికమగును. పరిచయం లేనివారితో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు అనుకూల సమయం. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వివాహాది శుభకార్యాలు నిదానంగా సాగుతాయి. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. నిరుద్యోగులు ఓర్పుతో వ్యవహరించాలి. వాహన, యంత్రాల వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి ఉద్యోగాలయందు మీ పనులకే అంకితమగుతూ ఇతరమైన విషయాలకు దూరంగా ఉండుట మంచిది. మీకు సహకరించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. చిన్న పనైనా కుటుంబ సభ్యుల సలహాలతో ఉండేటట్లు చూసుకోండి. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాలు అనందాన్నిస్తాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో సొంత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వండి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వంటివి ఏర్పడగలవు. కుటుంబంలో కొత్త వ్యక్తుల రాకలుంటాయి. దత్తాత్రేయుని పూజించాలి. బ్రాహ్మణులకు గాని ముత్తైదువలకు గాని తాంబూలం, శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఉద్యోగాలలో రావలసినవి వసూలవుతాయి. ఆదాయాలు అనుకూలం. గత సమస్యలకు పరిష్కారాలుంటాయి. ఉద్యోగస్తులకు శుభ ఫలితాలున్నాయి. సంతాన వివాహ విషయంలో శుభములుందును. వ్యాపారులకి దీర్హకాలిక రుణాలు అందుతాయి. ఖర్చులకు వెనడుగు వేయకుండా అన్నిటా మీరై వ్యవహరించుకుంటారు. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలతో లౌక్యంగా సాగాలి. స్థిరాస్తుల్ని వృద్ధిపరచు ఆలోచనలుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. నూతన వ్యాపార అవకాశాలు ఏర్పడతాయి. ఊహించుకున్నట్లు ఆర్థిక వ్యవహారాలను నిర్వహించగలుగుతారు. ముఖ్యమైన విషయాలు ఉత్సాహపరుస్తాయి. సంతానానికి మేలు జరుగుతుంది. దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు చూడగలరు. విద్యార్థులు, నిరుద్యోగులు టార్గెట్‌ విధానాలను పాటించుకోవాలి. కొన్ని అనవసర వివాదాల్లో పాల్గొంటారు . ఊహించని విధంగా అదనపు బాధ్యతలను స్వీకరించగలరు. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలున్నాయి. ఖర్చులను సమర్ధించుకోగలరు. ఉత్సాహకర స్థితులు నెలకొంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుది. కొత్త పరిచయాలు, కొత్త ప్రాంత సందర్శనాలు ఏర్పడగలవు. దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబములో ప్రశాంతత ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. విద్యార్థులకు అనుకూల సమయం. వ్యాసంగాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్సాహకరంగా పాల్గొంటారు. బాధ్యతాయుతంగా సాగగలరు. అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెడతాయి. దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి అవకాశాలు ఏర్పడగలవు. ఆరోగ్యం విషయంలో అధిక జాగ్రత్తలు అవసరం. ఉద్యోగాలలో అధికారులతోను, సహోద్యోగులతోను జాగ్రత్తలు అవసరం. వ్యాపారులకు దూరంగా ఉంటూ రొటేషన్‌లకు ప్రాధాన్యతనీయండి. ఇంటికి దూరంగా పనిచేయవలసి రావచ్చును. అనవసర ప్రయత్నాలు, వస్తువుల కొనుగోలు ఉండవు. బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులచే ఒత్తిడులుంటాయి. విశ్రాంతి లోపాలుంటాయి. ఇతరులను నమ్మి బాధ్యతలు అప్పగించకండి. విద్యార్థులకు, అవివాహితులకు అవకాశాలు ఏర్పడతాయి. భూ గృహం వంటి స్థిరాస్తి లావాదేవీలను పూర్తి చేసుకోగలుగుతారు. ఖర్చుల నుండి బయటపడేందుకు అప్పులు చేయాల్సి వస్తుంది. దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేయండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. పనులు వేగవంతంగా చేస్తారు. ఖర్చులు వెంటవెంటనే ఏర్పడుతున్నా సమర్థించుకుంటారు. ఆత్మీయులతో ఉత్సాహాలు పంచుకోగలరు. ఆరోగ్యవిషయాలలో మంచి మార్పులు చూస్తారు. అగ్రిమెంట్లు, అనుమతులు వంటివి పొందుటకు అనువైన సమయం. విద్యార్థుల కృషికి తగిన ప్రయోజనాలుంటాయి. దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కుటుంబ వ్యక్తులను, తోటి ఉద్యోగులను కలుపుకుని నిర్ణయాలు తీసుకోండి. రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆలోచలలో స్థిమితంగా వ్యవహరించుకోండి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రయత్న లోపాలు రాకుండా జాగ్రత్తలు పాటించుకోండి. రావలసిన బకాయిలలో లౌక్యంగా సాగండి. కుటుంబ వ్యక్తులను, తోటి ఉద్యోగులను కలుపుకుని నిర్ణయాలు తీసుకోవాలి. బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page