top of page
Suresh D

నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల జాతకులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి✨🔮

నేటి రాశి ఫలాలు తేదీ 10.02.2024 శనివారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి✨🔮

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధ ఆదాయాలు పెరుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలు, గృహమున మంగళతోరణములు, శుభప్రదమైన ఆనందదాయకమైన కలయికలు వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకొనుట మంచిది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. రక్తప్రసరణ, అజీర్ణం, మూలవ్యాధుల సమస్యలు రావచ్చు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అనవసర ఖర్చులకు పోయి నష్టపోకుండా జాగ్రత్త అవసరం. అప్పుల బారినపడకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉంది. మీ భాగస్వామి ప్రవర్తన మీకు నచ్చనప్పుడు హాస్య యుక్తి మర్యాద ఉపయోగిస్తే మీకు, తోటివారికి ఉపశమనము కలిగి ఉద్రిక్తతలకు దారితీయకుండా ఉంటుంది. కుటుంబమునందు సౌఖ్యము, ఆనందము కలుగును. జ్ఞానవృద్ధి, వ్యాపార ప్రయోజనాలను పొందుతారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. సామాజిక విషయాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ స్థానం పొందుతారు. ఉద్యోగ, వ్యాపారపరంగా కలసివచ్చును. ఆరోగ్యం అనుకూలించును. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కీర్తి లభించును. కుటుంబంలో ఆనందం. జీవిత భాగస్వామి, పిల్లలతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. నూతన వస్తు వస్త్రాల ప్రాప్తి. కుటుంబ సభ్యులతో వినోదాలలో పాల్గొంటారు. ఆభరణాల కొనుగోలు కోసం ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. స్త్రీలకు అనారోగ్య సూచనలు, కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉన్నాయి. ఆరోగ్య విషయమునందు అశ్రద్ధ వహించకూడదు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. మీ బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితులు గౌరవిస్తారు. కుటుంబముతో పుణ్య క్షేత్ర దర్శనం చేస్తారు. మానసిక ప్రశాంతత కలుగును. విద్యార్థులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. తులా రాశి స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు, మానసిక ఇబ్బందులు అధికమగును. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వినోదం, వ్యాపారంలో వృద్ధిని పెంచుతుంది. ఆర్ధికంగా లాభదాయకం. సమాజంలో అరుదైన గౌరవం కలుగుతుంది. పోటీలలో విజయం సాధిస్తారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుతారు. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. విదేశీ విద్యలు అనుకూలించును. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. నిద్రలేమి, మానసిక ప్రశాంతత లేకపోవుట వల్ల ఇబ్బందులు వస్తాయి. ఖర్చులు అధికమగును. మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరదేశాలలో ఉన్న మీ పిల్లల నుండి శుభవార్తలు వింటారు. అన్నింటా విజయం సాధిస్తారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు కష్ట సమయం. ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగమునందు రాజకీయ ఒత్తిడులు, ఇబ్బందులు ఏర్పడును. వ్యాపారాస్తులకు వ్యాపారంనందు సమస్యలు పెరుగును. వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక సమస్యలు ఏర్పడును. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

bottom of page