top of page

నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు ఆపద నుంచి బయట పడతారు✨🔮

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ05.02.2024 సోమవారం మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.✨🔮

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్య పనుల్లో విజయం లభిస్తుంది. ఏ విషయాన్నీ లోతుగా ఆలోచించవద్దు. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకుని అమలుచేయాలి. మొదలుపెట్టిన పనుల్ని ఆపకుండా పూర్తి చేయండి. అపార్థాలకి అవకాశం ఇవ్వవద్దు. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం అవసరం. వ్యాపారంలో శ్రద్ద పెంచితే లాభాలు సాధ్యం. శుభవార్త వింటారు. ధనలాభముంది. మేష రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు, ధనం పొందుతారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికిఈరోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్య పనుల్లో శ్రద్ద వహించాలి. ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాల్లో స్పష్టత అవసరం. కొన్ని విషయాల్లో గందరగోళ స్థితి నెలకొంటుంది. కొందరు కావాలని ఇబ్బంది కలిగిస్తారు. ఓర్పు వహించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కొన్ని పనులు దగ్గరి దాకా వచ్చి ఆగిపోతాయి. శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కృషిని బట్టి విజయం ఉంటుంది. చంచలత్వం లేకుండా సకాలంలో పనులు మొదలుపెట్టింది. వెనకడుగు వేయవద్దు. లక్ష్యం చేరువలోనే ఉంది. సమిష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి. నిజాయితీ కాపాడుతుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. కుటుంబసభ్యుల సలహాతో లాభపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. మిథున రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఇబ్బందులు తొలగి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా బలపడతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన, పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మనోబలంతో పనులు ప్రారంభించండి. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. పెట్టుబడులు విశేష లాభాన్నిస్తాయి. స్థిరచరాస్తులు వృద్ధిచెందుతాయి. ఖర్చు విషయంలో కాస్త ఆలోచించాలి. దగ్గరి వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వ్యాపారంలో శ్రద్ద వహించాలి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారంలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలున్నాయి. ధనలాభముంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సృజనాత్మక ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. దేనికీ వెనుకడుగు వేయవద్దు. శుభ ఫలితాలు కలుగుతాయి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆచరణాత్మకమైన నిర్ణయాలతో పనులు మొదలుపెట్టండి. కల సాకారమవుతుంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. బంధు మిత్రులతో బంధాలు బలపడతాయి. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా వ్యవహరించాలి. జీవితం ఆనందకరంగా సాగుతుంది. శివాష్టకం పఠించండి. ఈశ్వరుడిని పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు వ్యాపారపరంగా అనుకూలం. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచంచి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. విభేదాలకు దూరంగా ఉండండి. సున్నితంగా వ్యవహరించాలి. చిన్న పొరపాటు జరిగినా సమస్య పెద్దదవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీ నిర్ణయాలను బట్టి ఫలితాలుంటాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలుంటాయి. మీ బాధ్యతలను సకాలంలో పూర్తిచేయండి. మీవల్ల కొందరికి సహాయ సహకారాలు అందుతాయి. పేరు ప్రతిష్టలు సాధిస్తారు. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. ధనూ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు ఆర్థికపరంగా అనుకూల సమయం. మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి ధనయోగం వృద్ధి చెందుతుంది. బాధ్యతలను సకాలంలో నిర్వర్తించడం ద్వారా మేలు జరుగుతుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. అపార్థాలకు తావివ్వవద్దు. ఆవేశపరిచేవారున్నారు. శాంతంగా పనిచేయండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు సమయం కాదు. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు. ప్రతిభతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఎదురుచూస్తున్న పని ఒకటి ఈ సమయంలో పూర్తవుతుంది. వ్యాపారయోగముంది. ఆర్థికంగా బలపడతారు. సంపదలను పెంచుకోవడానికి సరైన సమయం. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభ రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలున్నాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సుస్థిరతనిస్తాయి. మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన ధాన్యాభివృద్ధి ఉంది. పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి అవుతుంది. స్థిరచరాస్తులు సమకూరుతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. వ్యాపారపరంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుడిని పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

bottom of page