top of page
Suresh D

నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల జాతకులు ఉద్యోగ, వ్యాపార రంగంలో రాణిస్తారు✨🔮

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 26.01.2024 శుక్రవారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.✨🔮

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల సమయం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. శుభకార్యాలను విజయవంతంగా పూర్తి చేయడానికి కొంత శ్రమించవలసి వస్తుంది. మీపై పుకార్లు, అపనిందలు ప్రచారంలో ఉంటాయి. వివాదాస్పద అంశాలను అనుకూలంగా మలచుకుంటారు. కోర్టు తీర్పులు లాభిస్తాయి. పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. శుభకార్యాలు సానుకూలపడతాయి. ఆదాయ వ్యయాలు సమంగా ఉంటాయి. లిఖితపూర్వక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. సంతానంపైన దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది. శత్రువర్గంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలపరంగా చికాకులు చోటు చేసుకోవచ్చు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉంది. ఉద్యోగస్తులు అధికారులకు కానుకలు అందచేస్తారు. ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను గుర్తిస్తారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరగలదు. లౌక్యంగా మెలిగి పనులు చక్కబెట్టుకుంటారు. మార్కెట్‌ రంగాల వారికి, ఇళ్ళ స్థలాల బ్రోకర్లకు ఏజెంట్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు వృత్తి ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యవహరించాలి. మధ్యవర్తిత్వాలు, రాయబారాలు, పంచాయితీలు తలనొప్పిగా పరిణమిస్తాయి. ఏదో ఒక కార్యక్రమం ద్వారా శత్రువర్గానికి హెచ్చరికలు జారీ చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ నిర్ణయాలకు కార్యరూపం ఇస్తారు. లక్ష్మీఅష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా అధికంగా శ్రమిస్తారు. అధికారుల మెప్పు పొందుతారు. గృహంలో ఎదురవుతున్న విభేదాలను ఆదిలోనే పరిష్కరించుకోవడం ఏంతైనా అవసరం. రాయబారాలు లాభిస్తాయి. మీ ధోరణిలో కొంత మార్పు కనిపిస్తుంది. మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా శ్రమ అధికమవుతుంది. ఉపయుక్తం లేని బాధ్యతలను తలకెత్తుకోవలసి వస్తుంది. ఆర్థికంగా లబ్దిని పొందుతారు. గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. హడావుడిగా కాలం గడుపుతారు. ఒక మిత్రునికి మీ సహకారం లభిస్తుంది. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రభుత్వ సంబంధమైన పనులు సానుకూలపడతాయి. లిఖితపూర్వక వ్యవహారాల వల్ల లాభపడతారు. వ్యక్తిగత హోదా, స్థాయి పెరుగుతాయి. దుబారా ఖర్చులు చోటు చేసుకుంటాయి. ఒక సమస్య తీరితే మరో సమస్యలను పరిష్కరించుకోవాల్సి వస్తుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. రిజిస్టేషన్‌ పనులు సానుకూలపడతాయి. ఆధ్యాత్మిక దీక్షలను స్వీకరిస్తారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఓ కొత్త ఆదాయ మార్గాన్ని అన్వేషించడం సఫలతను సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు సానుకూలపడుతుంది. సకాంలో అవకాశాలను వినియోగించుకోవడానికి అవసరమైన బలం, బలగం కలిగి ఉంటారు. శత్రువర్గం మీ గౌరవ మర్యాదలకు ఇబ్బంది కలిగించవచ్చు. వివాదాలు చోటు చేసుకున్నప్పటికీ అవి లాభంగానే ఉంటాయి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. భార్య తరపు బంధువుల సహకారం లభిస్తుంది. మొండివారిని ఒప్పించి పనులు పూర్తి చేస్తారు. మీరంటే గిట్టనివారు కొన్ని చికాకులు, తంటాలు తెచ్చిపెట్టినప్పటికి వాటిని అధిగమిస్తారు. శుభాకార్యాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. బ్యాంక్‌ రుణాలు మంజూరవుతాయి. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అధికంగా కష్టపడవలసి ఉంటుంది. రుణాలు ఇవ్వడం, రుణాలు తీసుకోవడం రెండూ కలసిరావు. వీసా, పాస్‌పోర్ట్‌ వంటి అంశాలు సానుకూలపడతాయి. మీరు ఎంతగానో నమ్మి ఎవరికైతే రహస్యాలు చెబుతారో వారేమీ వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తిలో కొన్ని మార్పులు చేస్తారు. కొత్త పెట్టుబడులు చోటు చేసుకుంటాయి. వివాదాలకు పోకుండా పనులను సానుకూలపరచుకుంటారు. ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రహస్య వ్యూహాలను అవలంభించి లాభపడతారు. రాజకీయ రంగంలోని వారికి అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. స్త్రీలతో విభేదాలు వచ్చే సూచనలున్నాయి. మీ నిర్ణయాలు సరి అయినవి అయినప్పటికీ ఇతరుల మాటలు మీలో మార్పులు తీసుకొస్తుంది. వ్యాపారపరంగా లబ్ధి చేకూర్చే ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆదాయ వ్యయాలో సమతుల్యత లోపించకుండా జాగ్రత్తలు వహించడం మంచిది. సహోదరీ వర్గంలో ఏర్పడిన విభేదాలు సమసిపోయే సూచనలున్నాయి. మీ సలహాలను, సూచనలను ఉన్నతస్థాయి వర్గం వారు కూడా పాటిస్తారు. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

bottom of page