top of page

✨నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారి మీద శని ప్రభావం, అప్రమత్తంగా ఉండాలి✨ 🔮

నేటి దిన ఫలాలు (రాశి ఫలాలు) తేదీ 10.01.2024 బుధవారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.✨ 🔮

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు జన్మరాశి యందు గురుడు, లాభస్థానములో శని, వ్యయస్థానములో రాహువు ప్రభావం చేత పనులలో ఒత్తిళ్లు ఏర్పడినప్పటికీ అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. భాగ్యములో రవి, కుజుడు, చంద్రుని ప్రభావం వలన శారీరక సౌఖ్యం, ఆనందం పొందుతారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. స్త్రీ సౌఖ్యం, ఆనందము పొందుతారు. ప్రయాణాలలో ధనం ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు ఈవారం అనుకూల ఫలితాలు ఇస్తుంది. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడుకున్నటువంటి సమయం. విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన ణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లం నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు కళత్ర స్థానములో బుధ, శుక్రుల అనుకూలత వలన కుటుంబ సౌఖ్యం, ఆనందము లభిస్తుంది. ఆనందం కోసం ప్రయాణాలు చేస్తారు. ప్రయాణముల కొరకు అధికముగా ధనమును ఖర్చుపెట్టెదరు. స్త్రీ సౌఖ్యం, ఆనందము పొందెదరు. ఉద్యోగస్తులకు ఖర్చులతో కూడుకున్నటువంటి రోజు. వ్యయస్థానములో గురుని ప్రభావం వలన ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. దశమంలో శని అనుకూలత వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది. గురుడు లాభస్థానములో సంచరించుట వలన ధనలాభము, వస్తులాభం వంటివి కలుగును. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. భాగ్యములో శని ప్రభావం వలన వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. శత్రు స్థానములో బుధ, శుక్రుల సంచారం వలన శత్రువుల వల్ల చికాకులు ఏర్పడును. కళత్రములో రవి ప్రభావం వలన జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలించును. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయి. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. అష్టమ శని ప్రభావం చేత సమస్యలు కొంత వేధించును. రవి, కుజులు ఆరో స్థానములో అనుకూలత వలన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బుధ, శుక్రుల ప్రభావం చేత ధనలాభం, వస్తులాభం కలుగును. ప్రయాణములో చికాకులు ఏర్పడతాయి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం లేదా వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. భాగ్యములో గురుని అనుకూల ప్రభావం వలన లాభము కలుగును. చతుర్ధంలో బుధ, శుక్రుల ప్రభావం చేత సౌఖ్యం, ఆనందం పొందెదరు. పంచమంలో రవి, కుజుల ప్రభావంచేత ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. మీ అనందము కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. ప్రయాణాలు అనుకూలించును. వాక్‌ స్థానములో కేతువు ప్రభావం వలన అవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలని సూచన. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీ జీవితంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమగును. ఆరో స్థానములో శని అనుకూలత వలన ప్రయాణములు అనుకూలించును. తృతీయంలో బుధ, శుక్రుల ప్రభావం వలన వ్యాపారాభివృద్ధి కలుగును. చతుర్ధంలో రవి, కుజుల ప్రభావం వలన కుటుంబ సభ్యులతో చర్చలలో భేదాభిప్రాయం ఉన్నప్పటికి మీ మాటే నెగ్గును. స్రీ సౌఖ్యం, ఆనందము పొందెదరు. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. వ్యాపారస్తులకు అనుకూలించును. విద్యార్థులకు కష్టపడవలసిన సమయం. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం, చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలించును. కళత్రములో గురుని ప్రభావం వలన కుటుంబ సభ్యుల ఆదరణ పొందెదరు. పంచమంలో శని, ఆరో స్థానములో రాహువు అనుకూల ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలించును. ధన స్థానములో బుధ,శుక్రుల ప్రభావం వలన ధనలాభము, సౌఖ్యము కలుగును. ఈరోజు కొత్త వస్తువులు లభించును. స్త్రీలకు అనుకూల సమయం. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. జన్మరాశిలో బుధ, శుక్రుల ప్రభావం వలన శారీరక శమ, అలసట కలుగును. సౌఖ్యం పొందినప్పటికి ఏదో విషయం మీద ఆలోచనలు, వేదన కలుగును. అష్టమ శని ప్రభావం వలన పనులయందు అలసత్వం ఏర్పడి ఒత్తిళ్ళకు గురవుతారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళకపోతే ఇబ్బందులు తప్పవు. వాక్‌ స్థానములో రవి, కుజుల ప్రభావం వలన గొడవలకు దూరంగా ఉండాలని సూచన. కోపము వలన నష్టపోయే సూచనలు ఉన్నాయి. శత్రు స్థానములో గురుని ప్రభావం వలన శత్రువుల వలన ఇబ్బందులు ఏర్పడును. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం, వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. తృతీయంలో శని, పంచమంలో గురుడు అనుకూలంగా ఉన్నప్పటికి జన్మరాశి యందు రవి, కుజుల ప్రభావం వలన పనుల యందు ఒత్తిళ్ళు, చికాకులు కలుగును. ఆరోగ్య విషయం, కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. వ్యయస్థానములో బుధ, శుక్రుల ప్రభావం వలన ధన వ్యయం కలిగే అవకాశం ఉంది. ఖర్చులు నియంత్రించుకోవాలి. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. స్రీలకు ఒత్తిళ్ళతో కూడినటువంటి సమయం. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పరించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. లాభ స్థానములో బుధ, శుక్రుల వలన ధనలాభం, వస్తులాభం కలుగును. స్రీ సౌఖ్యం, భోగము కలుగును. వ్యయస్థానములో రవి, కుజులు మరియు ధనస్థానములో శని (ఏలినాటి శని) ప్రభావం చేత ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగును. ప్రయాణములో ధన వ్యయం కలుగు సూచన. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. అరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం, చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మార్పు కలిగేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏలినాటి శని జన్మశని ఉన్నప్పటికి లాభస్థానములో రవి, కుజుల ప్రభావం వలన ధనలాభము, వస్తులాభము కలుగును. ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. దశమంలో బుధ, శుక్రుల అనుకూల ప్రభావం వలన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. వాక్‌ స్థానములో రాహువు ప్రభావం వలన అవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. స్రీలకు అనుకూలించును. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్బన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పరించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఏలినాటి శని ప్రభావం, జన్మరాహువు ప్రభావంచేత ఖర్చులు నియంత్రించుకోవాలి. గొడవల వల్ల మీ ప్రవర్తన వలన ఇబ్బందులు పెరుగును. దశమంలో రవి, కుజుల ప్రభావం వలన మీన రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు కలుగును. భాగ్యములో బుధ, శుక్రుల ప్రభావంచేత ధనలాభము, వస్తులాభము కలుగును. ప్రయాణాలలో ధనవ్యయం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. అవేశపూరిత నిర్ణయాలతో సమస్యలు అధికం అవుతాయి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం, వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page