top of page
Suresh D

నా ఎనర్జీకి కారణం సెక్స్..? 😳


మహువా మొయిత్రా. తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహువా మొయిత్రాకు ఫైర్ బ్రాండ్‌ అనే పేరు ఉంది. ఇక డబ్బులు, గిఫ్ట్‌లు తీసుకుని.. పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని నమోదైన కేసులో ఆమె లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇక ప్రస్తుతం మరోసారి టీఎంసీ పార్టీ తరఫున టికెట్ పొందిన మహువా మొయిత్రా.. ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రిపోర్టర్ ఓ ప్రశ్న అడగ్గా.. మహువా మొయిత్రా ఇచ్చిన సమాధానం విని.. ఆ రిపోర్టర్ షాక్ అయ్యాడు.ప్రచారంలో భాగంగా ఆమె ఓ వాహనంపై ప్రయాణిస్తుండగా.. స్థానిక టీవీ ఛానల్ రిపోర్టర్ మహువా మొయిత్రాను ఇంటర్వ్యూ చేశారు. "ఇంత ఎనర్జీగా ఉంటారు.. అసలు మీ ఎనర్జీకి కారణం ఏంటి" అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అయితే ఆమె సెక్స్ అన్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఆమె ఎగ్స్(కోడిగుడ్లు) అని అన్నట్లు కొందరు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మహువా మొయిత్రా ఎగ్స్ అంటే సెక్స్ అన్నారంటూ మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్న, జవాబుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. 🤯


bottom of page