ఏ రిలేషన్‌లో అయినా గొడవలు కామన్. కానీ, ఎక్కువరోజులు ఇవే కంటిన్యూ అయితే రిలేషన్‌లో గ్యాప్ వస్తుంది. కాబట్టి, అలా కాకుండా ముందు నుంచే జాగ్రత్తలు పడాలి. ముఖ్యంగా గొడవలు జరిగినప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకోండి.
గ్యాప్ ఇవ్వండి..
ఏదైనా గొడవ అయినప్పుడు ఓ రోజు మాట్లాడకుండా ఉండండి. దీని వల్ల గొడవ పెరగకుండా ఉంటుంది. అలాగే ఇద్దరు కూడా ప్రతీ ఆలోచించడానికి సమయం తీసుకుంటుంది. ఇద్దరి మధ్య మంచి రిలేషన్ మెంటెయిన్ చేయడానికి సహాయం చేస్తుంది.
ఫిజికల్ టచ్..
జరిగినప్పుడు మెల్లిగా తాకడం, కౌగిలించుకోవడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల గొడవ కూడా పెరగకుండా ఉంటుంది. కాబట్టి, కాస్త రొమాంటిక్‌గా ఉండండి.
లెటర్స్ రాయడం..
పెద్దగా గొడవ అయినప్పుడు ఆ పెద్ద గొడవని సద్దుమణిగేందుకు చిన్న లెటర్ రాయండి. అందులో మీరు చెప్పాలనుకున్న విషయాలను క్షుణ్ణంగా చెప్పండి. ఆ లెటర్ ఎలా ఉండాలంటే మీలోని ప్రేమని భావాలను వ్యక్తీకరించేలా ఉండాలని గుర్తుపెట్టుకోండి.
కాస్త తగ్గించి ఉండటం..
మీ పార్టనర్‌తో గొడవపడినప్పుడు కాస్త సున్నితంగా మాట్లాడండి. మాటలు జారొద్దు. కోపంలో ఏం మాట్లాడతామో ఆ విషయాలు చాలా దూరం తీసుకెళతాయి. అలా కాకుండా కొద్దిగా ఊపిరి పీల్చుకుని మీరు గతంలో ఆనందంగా ఉన్న క్షణాలను గుర్తుతెచ్చుకుని హ్యాపీగా ఉండండి.