top of page

జూన్ 30 మళ్ళీ థియేటర్స్ లో సందడి చేయనున్న పవర్ స్టార్ “తొలిప్రేమ”

1998 లో రిలీజ్ అయ్యి బ్లాక్బస్టర్ గా నిలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘తొలిప్రేమ’. ఇది కేవలం హిట్ మాత్రమే కాదు ఒక క్లాసిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా నిలిచింది .

దర్శకుడు కరుణాకరన్ స్టైల్ కామెడీ , లవ్ అండ్ సెంటిమెంట్ , మణిశర్మ బాణీలు , కీర్తి రెడ్డి అందం ఇంకా యంగ్ ఏజ్ పవన్ కరిజ్మా ఈ సినిమాకు తిరుగులేని విజయాన్ని అందించాయి. ఇప్పుడు రి-రిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో ఈ సినిమాను కూడా ఖుషి లాగానే 4k లో రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ నెల జూన్ 30 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మళ్ళీ థియేటర్ రిలీజ్ కానుంది. ఈ శనివారం ఈ చిత్ర 4k ట్రైలర్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.


コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page