🗳️ ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ, ఖమ్మంజిల్లా పాలేరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 🕰️ దీంతో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. 🪑 అందరూ నేతలు పాలేరుపై కన్నేసి.. పోటీకి చేయడానికి రెడీ అవుతున్నారు. 🏁
అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే టికెట్ ఇవ్వడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. 📢 ఇప్పటికీ వైఎస్ షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనంపై స్పష్టత రాకపోవడంతో.. ఆమె సైతం పాలేరు నుంచే పోటీకి సై అంటున్నారు. 🗳️ సిపిఎం పొత్తులో భాగంగా తమ్మినేని వీరభద్రం ఈ సీటు కావాలని పట్టు బడుతున్నారు. 🏆 ఇక కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ పాలేరు టికెట్ కావాలని కోరుతున్నారు. 🗳️ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఇప్పటి వరకూ స్పష్టత రాకపోవడంతో కేడర్‌లో కన్ఫ్యూజన్ నెలకొంది. 🤔 కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పాలేరు.. ఇపుడు హాట్ సీట్ గా ఎందుకు మారింది.. నేతలు ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. 🌟 పాలేరు నియోజకవర్గంపై టీవీ9 స్పెషల్ స్టోరీ..! 📺
👥 పాలేరు నియోజక వర్గం.. గత కొద్దిరోజులుగా ఇక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 🌍 ఆయా పార్టీలు ముఖ్యనేతలు పాలేరు నుంచి పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు. 🌠 ఏకంగా పార్టీలు మారి మరీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 🌟 పాలేరు ఎందుకు ఇంత స్పెషల్ అయ్యింది. 🤨 ఇక్కడే పోటీ చేయడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నదీ.. ఆసక్తికర చర్చ జరుగుతోంది.. 📋 అందరి కంటే ముందు.. బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే టికెట్ ఇవ్వడంతో.. ఆయన నియోజక వర్గంలో ప్రచారంలో ముందున్నారు. 🌟 అక్టోబర్ 27న ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సైతం పాలేరు నుంచే బహిరంగ సభ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 📣 ఒక విధంగా పాలేరు పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తుంది. 🎯