🔴 ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన దుండగులు బాలిక ప్రతిఘటించడంతో ఆమెను తీసుకెళ్లి రైలు కింద పడేశారు. 🚂
తీవ్రగాయాలతో బాలిక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. 😥 ఈ దారుణ ఘటన బరేలి సిటీలో అక్టోబరు 10న చోటుచేసుకుంది. 🗓️ బాధిత యువతి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబరు 10న సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కొంతమంది యువకులు ఆమెను అడ్డుకున్నారు. 🚶♂️🚶♂️ అసభ్యంగా ప్రవర్తించారు. ⚠️ వారి చర్యలను తీవ్రంగా ప్రతిఘటించిన బాలికను అందరూ కలిసి ఓ రైలు ముందు పడేశారు. 🚉 రైల్వే క్రాసింగ్ వద్ద తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు గుర్తించి ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. 🏥 రెండు కాళ్లు, ఒక చేయి కోల్పోయిన బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. 💉 నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. 🚓 ఇంటర్ చదువుతున్న తన కూతురిపై ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి వేధింపులకు పాల్పడ్డారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. 🕵️♂️🕵️♀️