top of page

తెలుగులో “నాయకుడిగా” వస్తున్న ఉదయనిధి స్టాలిన్

ఉదయనిధి స్టాలిన్, వడివేలు, కీర్తీ సురేష్, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా 'మామన్నన్'. తెలుగు టైటిల్, విడుదల తేదీ వెల్లడించారు.

తమిళనాట రాజకీయంగానూ సంచలనమైన సినిమా 'మామన్నన్' . అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి... ఈ చిత్ర కథాంశం, అందులో డైలాగులు. ఇది రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. రెండు... ఇందులో ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కథానాయకుడు కావడం! విమర్శకుల ప్రశంసలు & వసూళ్ళు! 'మామన్నన్' మీద వచ్చిన విమర్శలు, వివాదాలు పక్కన పెడితే... విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే, తమిళ ప్రేక్షకుల నుంచి సైతం మంచి స్పందన లభించింది. దాంతో వసూళ్లు కూడా బాగా వచ్చాయి. తమిళనాట థియేటర్లలో జూన్ 29న 'మామన్నన్' విడుదల కాగా... ఇప్పటి వరకు రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇప్పుడీ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

'మామన్నన్' తెలుగు అనువాదానికి 'నాయకుడు' టైటిల్ ఖరారు చేశారు. జూలై 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. తెలుగులో ఈ సినిమాను ఏషియన్ మల్టీప్లెక్స్, సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్నాయి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page