top of page
Shiva YT

🎶🎭 దూసుకుపోతున్న కీరవాణి.. 🎵

🎵 ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదు.. ఎంఎం కీరవాణిని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఎంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినా.. వాళ్లందర్నీ తట్టుకుని నిలబడటం కాదు పోటీ ఇస్తున్నారీయన. చూస్తుంటే ఆయన టైమ్ మళ్లీ స్టార్ట్ అయిందనిపిస్తుంది. ఒకటి రెండూ కాదు.. ఏకంగా అరడజన్ క్రేజీ ప్రాజెక్టులతో రేసులోకి వచ్చేసారు కీరవాణి.

🎬 టాలీవుడ్ మ్యూజిక్ అంతా ఇప్పుడు దేవీ, థమన్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడిప్పుడే అనిరుధ్ కూడా వస్తున్నారు. వాళ్లు వదిలేస్తే మిగిలిన వాళ్లకు ఆఫర్స్ వెళ్తున్నాయేమో అనిపిస్తుంది. ఇంత పోటీలోనూ కీరవాణి సమ్‌థింగ్ స్పెషల్ అనిపిస్తున్నారు. ఈ సీనియర్ సంగీత దర్శకుడి కోసం దర్శకులే కాదు హీరోలు ఎగబడుతున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు కీరవాణి వైపే చూస్తున్నారు నిర్మాతలు.

🎭 రాజమౌళి సినిమాలకు ఎలాగూ కీరవాణి ఫిక్స్. అందులో పాటలు ఎలా ఉన్నా.. ఆర్ఆర్ మాత్రం అదిరిపోతుంది. ఎంత పెద్ద సినిమా తీసినా.. మరో మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూడరు రాజమౌళి. సోషియో ఫాంటసీలకు కీరవాణిని మించిన ఆప్షన్ లేదు. అందుకే హరిహర వీరమల్లుతో పాటు విశ్వంభర, SSMB29లకు కీరవాణినే తీసుకున్నారు. పవన్, మహేష్ ఇద్దరితోనూ మొదటిసారి పని చేస్తున్నారు కీరవాణి.

🎭 మొన్న సంక్రాంతికి నాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగా సినిమాకు కీరవాణే సంగీతం అందిచారు. కుర్ర హీరోలు కూడా ఈయన వైపే చూస్తున్నారు. దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి నటిస్తున్న మూడో సినిమాకు లవ్ మీ టైటిల్ ఖరారు చేసారు. 🎬🎶

Comentários


bottom of page