🔵 కర్నాటక బంద్ సందర్భంగా మాండ్యా జిల్లాల్లో 144 సెక్షన్‌ను విధించారు. రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై నిరసన తెలుపుతున్నారు.
కర్నాటక సరిహద్దు 5 జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అటు కృష్ణగిరి, ధర్మపురి, సేలం, ఈరోడ్, నీలగిరిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తమిళనాడు వైపు వెళ్లే వాహనాలపై ఆంక్షలు పెట్టారు. 🌐 కన్నడ రైతుల బంద్ దృష్ట్యా కర్ణాటక పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ సందర్భంగా రోడ్లపై వాహనాలు, అవసరమైతే విమానాలను కూడా అడ్డుకుంటామని రైతు సంఘాలు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో బెంగళూరు నగరంలో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్, ఓలా, ఉబర్ డ్రైవర్లు, కార్ల యజమానుల సంఘం బంద్‌కు మద్దతు ఇచ్చాయి. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసివేశారు. బ్యాంకులు, అంబులెన్సులు, ఫార్మా వాహనాలు, ఆసుపత్రులు, వైద్య దుకాణాలు వంటి అత్యవసర సేవలు అందుబాటులో ఉంచారు. 🇮🇳