🏠🙍♀️ సాధారణంగా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మహిళలు ఫేషియల్స్ చేయించుకుంటారు. ఎందుకంటే అందంగా మరింత కాంతివంతంగా కనిపించాలని కోరుకుంటారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. ఫేషియల్స్ చేయించుకుంటారు. 🌟💁♀️
🧖♀️ ఫేషియల్ చేయించుకున్నాక జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చర్మం డల్ గా మారిపోతుంది. 🚫🚿 దీంతో వేలకు వేలు పెట్టినా పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. మరి ఫేషియల్ చేయించుకున్నాక మీ ఫేస్ గ్లో పోకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి. 🧖♀️🌟
-ఫేషియల్ చేయించుకున్నాక మూడు లేదా నాలుగు రోజుల వరకు ఎలాంటి కొత్త ప్రాడెక్ట్స్ వాడకపోవడమే మంచిది. ఫేషియల్ తర్వాత చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఏమైనా కెమికల్స్ పడకపోతే.. స్కిన్ అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. ⚠️⛔
-ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఎండలోకి వెళ్లకపోవడం, పొల్యూషన్ కి దూరంగా ఉండటంతో మేలు చేస్తుంది. పగటి పూట ఫేషియల్ చేయించుకుంటే.. మెత్తని స్కార్ఫ్ ని ముఖానికి చుట్టుకోవాలి. 🏞️🧣
-ఫేషియల్ చేయించుకున్న తర్వాత చేతులతో చర్మాన్ని పదే పదే తాకకూడదు. అలాగే తువాలుతో గట్టిగా రుద్దుకోకూడదు. అలాగే ఈతకొట్టడం, ఎక్కువ సార్లు ముఖాన్ని కడుక్కోకూడదు. 👐🧼
-ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఒక రోజు వరకు సబ్బులు కానీ, ఎలాంటి క్రీములు కానీ రాసుకోకుంటే బెటర్. 🌺🧴