top of page
Suresh D

ఈజీగా బరువు తగ్గాలా.. అయితే బ్రేక్ ఫాస్ట్‌లో ఇవి లేకుండా చూసుకోండి🩺👩‍⚕️

దీనివల్ల బరువు తగ్గకుండా.. పెరగడం ప్రారంభమవుతుంది. కావున ఆరోగ్యకరమైన దినచర్యను ఉదయాన్నే అల్పాహారం నుంచి ప్రారంభిస్తే.. బరువు తగ్గడంతోపాటు.. ఆరోగ్యంగా ఉండవచ్చు. అల్పాహారం సమయంలో మనం తినకూడని పదార్థాలేంటో తెలుసుకోండి..

ప్రస్తుతకాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వ్యాధులకు మూలం స్థూలకాయమేనని.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో పెరుగుతున్న బరువును తగ్గించుకోవాలని చాలా మంది అనుకుంటారు.. కానీ ఈ పని అంత సులభం కాదు. దీని కోసం కఠినమైన ఆహార నియమాలు, భారీ వ్యాయామాలను ఆశ్రయించవలసి ఉంటుంది. సాధారణంగా, మనం బరువు తగ్గించే ప్రక్రియలో ఉన్నప్పుడు, అల్పాహారం సమయంలో మనం కొన్ని పొరపాట్లు చేస్తాం, అది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీనివల్ల బరువు తగ్గకుండా.. పెరగడం ప్రారంభమవుతుంది. కావున ఆరోగ్యకరమైన దినచర్యను ఉదయాన్నే అల్పాహారం నుంచి ప్రారంభిస్తే.. బరువు తగ్గడంతోపాటు.. ఆరోగ్యంగా ఉండవచ్చు. అల్పాహారం సమయంలో మనం తినకూడని పదార్థాలేంటో తెలుసుకోండి..

ఆయిల్ ఫుడ్స్: భారతదేశంలో ఆయిల్ ఫుడ్స్ ట్రెండ్ చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఉదయం అల్పాహారంలో పూరీ-సబ్జీ లేదా కచోరీ, దోశ లాంటివి తినడానికి ఇష్టపడతారు. ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.. లేకపోతే బరువు వేగంగా పెరుగుతుంది.

కేకులు – కుకీలు: కేకులు, కుకీలు మీకు ఇష్టమైన ఆహార పదార్ధం కావచ్చు కానీ అవి ఆరోగ్యానికి హానికరం. వీటిలో బరువు పెరగడానికి కారణమయ్యే స్టార్చ్, చక్కెర ఉంటాయి. కాబట్టి అల్పాహారంలో వీటిని తీసుకోకండి.

నూడుల్స్: నూడుల్స్ చాలా మంది యువతను ఆకర్షిస్తున్న ఫాస్ట్ ఫుడ్.. కానీ ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ బరువును పెంచుతుంది. అందువల్ల, అల్పాహారంలో అస్సలు తినవద్దు.

ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్: మన డైలీ డైట్‌లో ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగే ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో తాగకూడదు. ఎందుకంటే ఇందులో ఆరోగ్యానికి హాని కలిగించే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇంట్లో పండ్ల రసాన్ని తీసుకోవడం మంచిది.

ప్రాసెస్డ్ ఫుడ్: మారుతున్న కాలంలో, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినే ధోరణి బాగా పెరిగింది. అయితే ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఆహారాలు వీటిని వండేటప్పుడు అనేక ప్రక్రియలను ఎదుర్కొంటాయి. వీటిలో మాంసం, బర్గర్లు, చిప్స్ మొదలైనవి ఉన్నాయి. వీటిని తినకుండా ఉండటమే మంచిది.🩺👩‍⚕️

Comments


bottom of page