మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ ఎస్‌యూవీ.. బెంజ్ కంపెనీ నుంచి మన దేశంలో విడుదలవుతున్రు రెండో ఈవీ ఇది. సెప్టెంబర్ 15న రానుంది. అదిఅత్యాధునిక డిజైన్ ను కలిగి ఉంది. మూడు డిస్‌ప్లేలను కలిగి ఉన్న 56-అంగుళాల ఎంబక్స్ శక్తితో కూడిన హైపర్‌స్క్రీన్ ఉంటుంది.
దీనిలో 89కేడబ్ల్యూహెచ్, 90.6కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌లలో అందుబాటులో ఉంది. కనీసం 407 కిలోమీటర్ల పరిధిని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది, పెద్ద యూనిట్ 433 కిలోమీటర్ల వరకు వస్తుందని చెబుతోంది. దీని ధర సుమారు రూ. 1 కోటి (ఎక్స్-షోరూమ్) నుంచి ఉంటుందని అంచనా.
వోల్వో సీ40 రీఛార్జ్.. వోల్వో సీ40 రీఛార్జ్ అనేది ఎక్స్ సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కూపే వెర్షన్. ఇది సెప్టెంబర్ 4న విడుదల కానుంది. దీని అంచనా ధర రూ. 60 లక్షలతో (ఎక్స్-షోరూమ్), ఇది బీఎండబ్ల్యూ ఐ4, హ్యూందాయ్ ఐయానిక్ 5, కియా ఈవీ6లకు పోటీగా మార్కెట్లోకి వస్తుంది. దీనిలో వర్టికల్ పోర్ట్రెయిట్-స్టైల్ 9-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్,12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో క్యాబిన్ క్లాసీగా కనిపిస్తుంది. వోల్వో అడాస్, 360-డిగ్రీ కెమెరా, బహుళ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉన్న అధునాతన భద్రతా కిట్ ఇందులో ఉంటుంది. 78కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.ఇది 530 కిలోమీటర్ల పరిధిని క్లెయిమ్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 27 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ⚡🔌