top of page

యూట్యూబ్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. యూజర్లకు మరింత వెసులుబాటు..

యూట్యూబ్ అంటే తెలియనివారు, చూడనివారు దాదాపు ఎవ్వరూ ఉండరంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మన జీవితంతో అంతలా పెనువేసుకున్న స్ట్రీమింగ్ వెబ్ సైట్ ఇది. ప్రపంచంలో ప్రతి విషయానికి సంబంధించి సమాచారం దీనిలో లభిస్తుంది. వింతలు, విశేషాలు, రాజకీయాలు, వినోదం, సమాచారం, కొత్త ఆవిష్కరణలు, సినిమాలు.. ఇలా ప్రతి దాని గురించి యూట్యూబ్ లో సమాచారం ఉంటుంది.తన వినియోగదారులకు యూట్యూబ్ ఎప్పుడు కొత్తదనం అందిస్తూనే ఉంటుంది. నూతన ఫీచర్లు ప్రవేశపెడుతుంటుంది. దానిలో భాగంగానే ఇప్పుడు రెండు ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. జంప్ ఏహెడ్, ఆస్క్ పేరుతో తీసుకువచ్చిన వీటి ప్రత్యేకతలను తెలుసుకుందాం.

జంప్ ఏహెడ్..

ఏఐ పవర్డ్ జంప్ ఏహెడ్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. సాధారణంగా యూట్యూబ్ లో వీడియోలు చూసినప్పుడు కొన్ని విభాగాలను ఫార్వార్డ్ చేస్తుంటాం. కొత్త ఫీచర్ ఇలాంటి సమయంలో బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ ఫీచర్ ద్వారా ఫార్వార్డ్ చేయాల్సిన వీడియోల విభాగాలను మరింత ఎంతో సమర్థంగా దాటవేయడానికి వీలుంటుంది. జంప్ ఎహెడ్ అనే కొత్త ఏఐ పవర్డ్ ఫీచర్‌ను మరింత మంది ప్రీమియం సభ్యులకు యూట్యూబ్ అందజేస్తోంది. తద్వారా వారు వీడియోల విభాగాలను మరింత సమర్థవంతంగా ఫార్వార్డ్ చేయడానికి వీలుంటుంది. వీడియోలో తరచుగా దాటవేయబడిన విభాగాలను గుర్తించడానికి ఈ ఫీచర్ మెషీన్ లెర్నింగ్, వీక్షణ డేటా (వ్యూయింగ్ డేటా)ను ఉపయోగిస్తుంది, వీక్షకులు నేరుగా తమకు నచ్చిన విభాగాలకు వెళ్లేలా చేస్తుంది.

మరో ఫీచర్..

జంప్ ఎహెడ్ తో పాటు ఏఐ రూపొందించిన ఆస్క్ (ask) అనే ప్రశ్నల ఫీచర్‌ను వినియోగదారులు యాక్సెస్ చేయవచ్చు. ఈ ఏఐ ఆధారిత ఫీచర్లు మెషీన్ లెర్నింగ్, డేటా విశ్లేషణ ద్వారా వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడంలో యూట్యూబ్ నిబద్ధతను తెలియజేస్తున్నాయి. ఆస్క్ అనేది ఎక్స్ పర్మెంటల్ కాన్వర్సేషనల్ ఏఐ టూల్. ఇది వినియోగదారులు వీడియోలు చూస్తూ ప్రశ్నలను అడగడానికి అనుమతిస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లో ఉండే కనీసం 18 ఏళ్ల వయస్సు ఉన్న యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్ల కోసం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. 

ఆస్క్ ఫీచర్‌ని ఉపయోగించే వీక్షకులు తప్పనిసరిగా తమ ఖాతా కోసం దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఆపై అర్హత ఉన్న వీడియోల క్రింద ఉన్న ఆస్క్ బటన్‌ను ఎంచుకోవాలి. తద్వారా ప్రశ్నలను టైప్ చేయడం, సారాంశాలు, కంటెంట్ సిఫార్సుల వంటి సూచించబడిన ప్రాంప్ట్‌ల నుంచి ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఈ ఏఐ వీడియో కంటెంట్, ప్రశ్నను ప్రాసెస్ చేస్తుంది. వీడియో ప్లే అవుతున్నప్పుడు సంబంధిత సమాధానాలను అందిస్తుంది.

bottom of page