top of page
Shiva YT

🎥🌟 పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే సినిమాలు ఇవే.!

🌟 అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి..? పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నారు..? అదేంటి త్రివిక్రమ్‌తో ఉండబోతుందని ఆల్రెడీ అనౌన్స్ చేసారు కదా అనుకోవచ్చు. ఇది సినిమా ఇండస్ట్రీ.. ఇక్కడ రాత్రికి రాత్రే కాంబినేషన్స్ మారిపోతుంటాయి.

🤩 ఈ మారిన కాంబినేషన్స్‌లో అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారు..? పుష్ప 2 రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదు.. అనుకున్నట్లుగానే ఆగస్ట్ 15 నుంచి పుష్ప గాడి రూల్ ఇండియాలో ఉంటుందని మరోసారి చెప్పారు దర్శక నిర్మాతలు.

🎬 దాంతో బన్నీ తర్వాతి సినిమాపై చర్చ మొదలైందిపుడు. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ప్రకటించినా.. అది ఇంకాస్త ఆలస్యమయ్యేలా ఉంది. దాంతో బోయపాటి శ్రీను సడన్‌గా రేసులో ముందుకొచ్చారు.

🌐 2016లో బన్నీ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు బ్లాక్‌బస్టర్ అయింది. సీనియర్ హీరోలు కాకుండా.. ఈ జనరేషన్ హీరోలలో బోయపాటి హిట్ కొట్టిన హీరో అల్లు అర్జున్ మాత్రమే. ఈ కాంబోనే మరోసారి రిపీట్ కానుంది.

🌟 గీతా ఆర్ట్స్‌లోనే బోయపాటి తర్వాతి సినిమా ఉండబోతుందని అధికారికంగా కన్ఫర్మేషన్ వచ్చింది. స్కంద ఫ్లాపైనా.. ఈయనపై నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారు అల్లు అరవింద్.

🤩 అయితే బోయపాటి తర్వాతి సినిమా బన్నీతోనే అయినా.. అల్లు అర్జున్ తర్వాతి సినిమా మాత్రం అట్లీతో ఉండే ఛాన్స్ ఉంది. ఆ ప్రాజెక్ట్ అయ్యాక బోయపాటి సినిమాపై ఫోకస్ చేయనున్నారీయన.

📆 అప్పటి వరకు స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు ఈ మాస్ డైరెక్టర్. మొత్తానికి అట్లీ, బోయపాటి సినిమాలతో మరో మూడేళ్లు బిజీ అయిపోయారు బన్నీ. 🌟

bottom of page