top of page

ఈ సీజన్‌లో హయ్యెస్ట్ పెయిడ్ ఐపీఎల్ కెప్టెన్లు వీరే..🏏

డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఈ ఏడాది రూ. 12 కోట్లు తన జీతంగా తీసుకోబోతున్నాడు. అలాగే ఎంఎస్ ధోని.. సీఎస్‌కే టీం సారధ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు ఇస్తాడని కూడా వార్తలొస్తున్నాయి. 🏆

తన కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్‌కు తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యా.. ఈసారి ముంబై ఇండియన్స్‌ సారధ్య బాధ్యతలను చేపట్టనున్నాడు. గుజరాత్ తిరిగి ముంబైకి హార్దిక్‌ను ఇచ్చినందుకు రూ. 100 కోట్లు చెల్లించిందని రూమర్స్ వస్తున్నాయి. ఇక ఐపీఎల్‌లో హార్దిక్ జీతం రూ. 15 కోట్లు. 🤑

హార్దిక్ నిష్క్రమణ తర్వాత, గుజరాత్ టైటాన్స్ జట్టు సారధ్య బాధ్యతలను శుభ్‌మాన్ గిల్ చేపడతాడు. అతడు 2022 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి గుజరాత్ జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు గిల్.. గుజరాత్‌లో అందుకుంటున్న జీతం రూ.8 కోట్లు. 🏅

ఈ ఐపీఎల్ 2024 సీజన్‌కు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. ఐపీఎల్ ఆడినందుకు అతడికి ప్రతీ ఏడాది రూ.14 కోట్లు ఇస్తోంది రాయల్స్ ఫ్రాంచైజీ. 🚁

ఐపీఎల్‌లో ఆడినందుకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ రూ.8.25 కోట్లు అందుకుంటున్నాడు. గతేడాది పంజాబ్ జట్టుకు పలు చిరస్మరణీయ విజయాలు ఒంటిచేత్తో అందించాడు ధావన్. 🏏

ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు ఫాఫ్ డుప్లెసిస్, అతడి ఐపీఎల్ జీతం రూ. 7 కోట్లు. విరాట్ కోహ్లి బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 🏆

ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారధ్యం వహిస్తున్నాడు పాట్ కమిన్స్. ఐపీఎల్ మినీ వేలంలో కమిన్స్‌ను హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. 🌟

అటు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ ఏడాది ఐపీఎల్ ఆడితే.. అతడికి ఆ ఫ్రాంచైజీ ప్రతీ ఏటా రూ.16 కోట్లు చెల్లిస్తోంది. 🎉

రూ. 12.25 కోట్లతో శ్రేయాస్ అయ్యర్.. ఈ ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సారధ్యం వహించబోతున్నాడు. గాయం నుంచి గతేడాది అతడు సీజన్ మొత్తం ఆడకబోయినా.. ఈ సీజన్‌కు కూడా అతడ్నే కెప్టెన్‌గా ఉంచింది కేకేఆర్. 😎

కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 17 కోట్లకు కొనుగోలు చేసింది. గత రెండు సీజన్లుగా ఆ ఫ్రాంచైజీకి సారధ్య బాధ్యతలు చేపడుతున్నాడు రాహుల్. 🏏


bottom of page