మెదడు ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉంటే జ్ఞాపకశక్తి, రీజనింగ్, సమస్యలు పరిష్కరించే సామర్ధ్యం, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం సరిగ్గా ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే దైనందిన జీవితంలో మనం అన్ని పనులనూ చక్కబెట్టగలగడంతో పాటు ఉత్పాదకత, శారీరక ఆరోగ్యం సవ్యంగా ఉండేలా చూసుకోగలం. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఆహారంలో మార్పులు కూడా దోహదపడతాయి. కొన్ని పోషకాలు, పదార్ధాలు, పానీయాలు తీసుకోవడం ద్వారా ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి దూరంగా ఉండటంతో పాటు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించుకుని మెమరీ పవర్‌ను మెరుగుపరుచుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. న్యూరోడీజనరేటివ్ వ్యాధుల బారి నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. కాగ్నిటివ్ హెల్త్ కోసం కొన్ని డ్రింక్స్ తీసుకుంటే మేలని న్యూట్రిషనిస్ట్‌లు సూచిస్తున్నారు.
ఈ పానీయాల్లో గ్రీన్ టీ ముందువరుసలో ఉంటుంది. గ్రీన్‌టీలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్స్, కేటెచిన్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మెదడు కణాలను కాపాడతాయి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడీజనరేటివ్ వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి. గ్రీన్‌టీలో స్వల్పంగా ఉండే కేఫిన్ మెదడును ఉత్తేజపరిచి, ఏకాగ్రత కుదిరేలా చేస్తుంది. ఇక మెదడుకు మేలు చేసే డ్రింక్స్‌ను పరిశీలిస్తే..
గ్రీన్ టీ
కాఫీ
టర్మరిక్ మిల్క్
బీట్రూట్ జ్యూస్
దానిమ్మ జ్యూస్
కెంబుచ
పిప్పర్‌మెంట్ టీ