top of page
MediaFx

థియేటర్లలో విడుదలై ఇంకా ఓటీటీలోకి రానీ సినిమాలు ఇవే..

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సూపర్ హిట్ చిత్రాలపై ఫోకస్ చేస్తున్నాయి. అటు థియేటర్లలో విడుదలై నెల రోజులు పూర్తికాకముందే స్ట్రీమింగ్ చేస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను నెల రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తీసుకవచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అటు వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తూనే మరోవైపు థియేటర్లలో సక్సెస్ అయిన చిత్రాలను భారీ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. కానీ విడుదలకు ముందు మంచి బజ్ చేసుకుని థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. సరికొత్త కంటెంట్.. ట్విస్టులతో ఆసక్తిని రేకెత్తించిన పలు చిత్రాలు థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కానీ ఇప్పటికీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. అవెంటో ఇప్పుడు చూద్దాం.

లాల్ సలామ్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "లాల్ సలామ్" ఫిబ్రవరి 9న విడుదలై నాలుగు నెలలు దాటింది. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇంకా ఓటీటీలో రిలీజ్ కాలేదు.

రాజాకార్

తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో వచ్చిన "రాజాకార్" మార్చి 15న విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. స్ట్రీమింగ్ హక్కులను జీ5 దక్కించుకున్నా, ఇంకా ఓటీటీలో రిలీజ్ కాలేదు.

ఏజెంట్

అక్కినేని అఖిల్ నటించిన "ఏజెంట్" గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. స్ట్రీమింగ్ హక్కులను సోనీలివ్ పొందినా, లీగల్ సమస్యల వల్ల ఓటీటీలో ఇంకా రిలీజ్ కాలేదు.

రాజశేఖర్ శేఖర్

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన "రాజశేఖర్ శేఖర్" హారర్ ఫిల్మ్‌గా మంచి రివ్యూలు అందుకుంది. థియేటర్లలో లాభాలు తెచ్చుకున్నా, లీగల్ సమస్యల కారణంగా ఓటీటీలో ఇంకా విడుదల కాలేదు.

bottom of page