భువనేశ్వర్, అక్టోబర్ 9: 😢 ఒడిసా మూడు రైళ్ల దుర్ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతూనే ఉంది. 😥 దేశ రైల్వే చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదంగా ఇండియన్ రైల్వే ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల యాక్సిడెంట్‌ను పేర్కొంది. 😭
ఈ ఏడాది జూన్ 2వ తేదీన ఓడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. 😞 ఈ ఘటనలో 297 మంది మరణించగా, 1100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. 😰 ఈ ఘటన జరిగి 4 నెలలు గడుస్తున్నా ఇంకా 28 మృతదేహాలను గుర్తించలేదు. ☹️ ప్రమాదం తర్వాత మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. 😔 వాటిల్లో 28 మృతదేహాలు ఇప్పటికీ మార్చురీలోనే ఉన్నాయి. 😢 ఈ మృతదేహాలను తొలగించే బాధ్యతలను రైల్వే విభాగం భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగించింది. 🏭 వీరిని శాస్త్రీయంగా ఖననం చేసేందుకు పౌర సంస్థ ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని జారీ చేసింది. 🏛️
ఆ మృతదేహాలకు సంబంధించిన వారు ఎవ్వరూ రాకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 👪 దీంతో అధికారులే ఆ 28 డెడ్‌బాడీస్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఓపీ జారీ చేశారు. 💼 సీబీఐ అధికారుల సమక్షంలో మృతదేహాలను కార్పొరేషన్‌కు అప్పగిస్తామని, మంగళవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని బీఎమ్సీ మేయర్ సులోచన దాస్ మీడియాకు తెలిపారు. 📢📺