top of page

👮‍♀️ ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన పోలీసులు.. 👩‍🦰

👏 ఓ మహిళను ప్రాణాలకు తెగించి కాపాడారు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు. 🌊 నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన యువతిని కాపాడిన పోలీసులపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 🙌

ఒక్క ఫోన్‌కాల్‌తో సకాలంలో స్పందించి మహిళను కాపాడిన పోలీసుల తీరును మెచ్చుకుంటున్నారు. 👍 ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది. 🚓 విజయవాడకు చెందిన ఓ యువతి కృష్ణానదిపైన వారధి 27వ ఖానావద్ద నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ☹️ అది గమనించిన స్థానికులు ఎవరో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్థానిక ఎస్సై రమేశ్‌, ఇతర పోలీసులు చిమ్మ చీకటిలో నదిలో దూకి రెండు గంటలపాటు శ్రమించి యువతిని పైకి తీసుకొచ్చారు. 🏥 అనంతరం 108 లో ఆస్పత్రికి తరలించారు. 🏨 మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. 👩‍⚕️ కాగా ఒక్క ఫోన్‌ చేయగానే సకాలంలో స్పందించి, ప్రాణాలకు తెగింగి యువతిని కాపాడిన పోలీసులను అందరూ మెచ్చుకుంటున్నారు. 📞🆘


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page