🇦🇫 ఆఫ్ఘానిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆఫ్ఘానిస్తాన్‌లోని బదక్షన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం ఆదివారం ఉదయం కూలిపోయింది.
ఆఫ్ఘానిస్తాన్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. అఫ్గానిస్తాన్‌లో తోప్‌ఖానా పర్వతాల్లో విమానం కూలిపోయిందని.. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగిందని పేర్కొంది. అయితే, విమానం వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో ప్రయాణించిందని.. ఆదివారం ఉదయం బదక్షన్‌లోని జెబాక్ జిల్లాలోని పర్వత భూభాగాన్ని ఢీకొట్టినట్లు ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం సైతం నిర్ధారించింది.
📅 అయితే, ముందుగా.. కుప్పకూలిన విమానం భారతదేశానికి సంబంధించినదని వార్తలొచ్చాయి. భారత్ నుంచి మాస్కోకు వెళుతుండగా విమానం క్రాష్ అయిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన డీజీసీఏ.. అది భారత విమానం కాదని పేర్కొంది. భారత్ నుంచి ఆ సమయంలో షెడ్యూల్డ్ ఫ్లైట్స్ లేవన్న భారత అధికారులు.. ప్రమాదానికి గురైంది భారత విమానం కాదని నిర్ధారించాయి. కుప్పకూలిన విమానం మొరాకోలో రిజిస్టర్ అయిన విమానంగా అధికారులు గుర్తించారు. ✈️