🏞️ ఉత్తర తెలంగాణ లో పార్టీ బలహీనంగా ఉండడం వల్ల… సునీల్ కనుగోలు సూచనలతో అక్కడి నుండే బస్సు యాత్ర చెపట్టెందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు.. 🚌🏞️
అక్టోబర్ 16 న బాసర సరస్వతి ఆలయం వద్ద బస్సు యాత్ర ప్రారంభించి నిజామాబాద్ ,ఆదిలాబాద్ , మంచిర్యాల ,కరీంనగర్ ,వరంగల్ ,మెదక్ ,రంగారెడ్డి ,హైదరాబాద్ , నల్గొండ ,ఖమ్మం మీదుగా ఈ బస్సు యాత్ర ఉండబోతుంది.. 🚌🛤️ ప్రధానంగా ఆరు గ్యారంటీ స్కీమ్స్ ని ప్రజల్లో వివరించనున్నారు.. 💼 తాము వస్తే మహిళలకు ప్రతినెలా 2500 పంపిణి, 500 కే వంట గ్యాస్ సిలిండర్. 👩👧👦🚌 అర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మహిళలకు అవగాహన కల్పించాలని .. 👩🌾 ప్రతిఏటా రైతులు,కౌలు రైతులకు 15,000 బ్యాంక్ అకౌంట్ లోకి .. 👨🌾 వ్యవసాయ కూలీలకు 12,000 పంపీణి. వరిపంటకు 500 బోనస్.. 💰 ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ .. ⚡ ఇల్లులేని వారికి ఇంటి స్థలం తో కలిపి 5 లక్షల తో ఇంటి నిర్మాణం… 🏠 తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం యువ వికాసం స్కీమ్ ద్వార విద్యార్ధులకు 5 లక్షల విద్యా,భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు, చేయూత స్కీమ్ పథం ద్వార వృద్దులకు, వికాలంగులకు, ఒంటరి మహిళలకు 4,000 నెలవారీ పింఛను, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యభీమా వీటిని గ్రామ గ్రామనా డోర్ టూ డోర్ వివరించనున్నారు.. 💡 అదే సమయంలో బీఆరెస్ వైపల్యాలపై ఛార్జిషీట్ తో పాటు, స్థానిక సమస్యలపై ప్రధానంగా బస్సు యాత్రలో ఫోకస్ చేయాలని భావిస్తున్నారు.. 💪