top of page
Shiva YT

ఏడాదిలో 39 సినిమాలు చేసిన ఏకైక హీరో..

సౌత్ సినిమాలకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆదరణ పెరిగింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్నీ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ సరిగా ఉంటే మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అందిస్తున్నారు. దీంతో సీనియర్ హీరోలు కూడా సక్సెస్ అందుకుంటున్నారు.

అయితే, 80, 90లలో హీరోలు వరుస చిత్రాలతో ఎంత బిజీగా ఉండేవారో తెలిసిందే. ఏడాదికి ఒక్కో హీరో కనీసంగా మూడు నాలుగుచిత్రాల్లో నటించే వారు. వారి సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చేవి.టాలీవుడ్ లో కృష్ణ (Krishna), ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి హీరోలు తమదైన ముద్రను వేశారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతను చాటారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఒకే ఏడాదిలో ఎక్కువ సినిమాలు తీసిన హీరోగా తెలుగులో కృష్ణ నిలిచారు.సూపర్ స్టార్ కృష్ణ 90లలో ఒకే ఏడాది ఏకకాలంలో 18 సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్ చేశారు. ఇక ఇండియాలోనే ఏడాదిలో 39 చిత్రాల్లో నటించి మరో హీరో ఆల్ టైమ్ రికార్డు సెట్ చేశారు.ఆయన మరెవరో కాదు.. మలయాళ ఇండస్ట్రీ మెగాస్టార్ మమ్ముట్టీ (Mammootty)నే. 1985లో ఏకంగా 39 చిత్రాల్లో నటించి రికార్డు సెట్ చేశారు. అంతకు ముందు రెండేళ్లలోనే 69 సినిమాల్లో నటించారు. 86లోనూ 35 చిత్రాల్లో నటించారు.రోజుకు 16 గంటల వరకు షూటింగ్ లోనే ఉన్నట్టు ఆయనే గత ఇంటర్వ్యూల్లో చెప్పడం విశేషం. ఇక ఇప్పటి హీరోలు భారీ విజువల్స్, యాక్షన్ సీన్ల కారణంగా ఏడాదికి ఒక్క సినిమా కూడా కష్టమే అవుతోంది. ఇక మమ్ముట్టీ చివరిగా ‘యాత్ర2’, ‘భ్రమయుగం’ వంటి చిత్రాలతో అలరించారు.

bottom of page