top of page

🌊🏙️ కొనసాగుతోన్న బెంగళూరు బంద్.. ‘మన నీరు–మన హక్కు’.. కిచ్చా సుదీప్ ట్వీట్..

🌧️ కర్ణాటక జల సంరక్షణ కమిటీ ఈరోజు బెంగళూరు బంద్‌కు పిలపునిచ్చింది. ఈ బంద్‌కు 100కు పైగా సంస్థలు మద్దతు తెలిపాయి. ప్రతిపక్షాలన్నీ బంద్‌కు మద్దతు తెలపడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరు బంద్‌ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

👥 తమిళనాడు ముఖ్యమంత్రులతో సామరస్యపూర్వక చర్చల ద్వారా సమస్యను తాత్కాలికంగా పరిష్కరించుకోవచ్చని మన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా గత ముఖ్యమంత్రుల మాదిరిగానే చెప్పారని విన్నాను. ప్రస్తుత కరువు-నీటి ఎద్దడిని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. క‌ర్నాట‌క ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకునేందుకు పార్టీల నేత‌లంద‌రూ క‌లిసి రావాల‌ని కోరుతున్నాను. త‌మిళ‌నాడు రైతుల‌కు కూడా పంట‌కు నీరందించండి, అయితే ముందుగా మ‌న తాగునీటి ఎద్దడిని తీర్చండి.. ఈ స‌మ‌స్యను వీలైనంత త్వర‌గా ప‌రిష్కరించండి. పోరాటం గెలుస్తుంది, దీనితో పాటు కృష్ణా నది – మహదాయి నది, ఉత్తర కర్ణాటకలో కలసా బండూరి వివాదాల పరిష్కారంతో ప్రజల కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నాను. మన నీరు మన హక్కు అంటూ నటుడు కిచ్చా సుదీప్ ట్వీట్ చేశారు. 💧👥🚜🤝🌍👨‍🌾

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page